Ashwin on Sanju: రెండు కోణాల్లో చూడాలి.. సంజూ బ్యాటింగ్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin on Sanju: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా సంజూ శాంసన్‌కు అవకాశం లభించింది. ప్లేయింగ్ XIలో రింకూ సింగ్ స్థానంలో వచ్చిన శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 15 బంతుల్లో 24 పరుగులు చేసి టీమ్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. అతని స్ట్రైక్ రేట్ టీమ్‌కు మొదటి మంచి మోమెంటమ్ ఇచ్చింది.
Earthquake In Kolkata: వణికిన కోల్‌కతా.. బంగ్లాదేశ్ కేంద్రంగా 5.4 తీవ్రతతో భూకంపం!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ శాంసన్ ప్రదర్శనపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను దీనిని రెండు కోణాల్లో చూస్తాను. ఒకటి నాకు తెలిసిన సంజూ శాంసన్ వ్యక్తిత్వం, అతని సామర్థ్యం. రెండోది భారత జట్టులో అతని పాత్ర. ఈ వరల్డ్ కప్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యం పై ఈ మ్యాచ్ లో స్పష్టత వచ్చింది. జట్టుకు మంచి ఆరంభం లభించింది. సంజూ 15 బంతుల్లో 28 లేదా 16 బంతుల్లో 30 పరుగులు చేస్తే.. ఫైనల్ వరకు అదే కొనసాగిస్తే, అతను తన పని చేసినట్టే.. అని అశ్విన్ అన్నాడు.
360° స్పేషల్ ఆడియో, బోస్ సౌండ్ టెక్నాలజీతో ప్రీమియం ఆడియో అనుభవం.. Noise Master Buds 2 లాంచ్.!
అశ్విన్ మరింతగా మాట్లాడుతూ.. శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ వ్యక్తిగా నాకు ఇష్టం. అతను ఒక పెద్ద స్కోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి వేదిక అతనికి మళ్లీ రాకపోవచ్చు. మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చుకోవాలి.. ఇన్ని సంవత్సరాల కష్టానికి ఇది సరైన సమయమని అన్నాడు. కనీసం ఒక సెంచరీ లేదా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో వరల్డ్ కప్ ముగిస్తే.. అతని ఆత్మవిశ్వాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. దానికి అందుకు అర్హుడు అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇక సూపర్ 8లో చివరి మ్యాచ్ మార్చి 1న వెస్టిండీస్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకూ డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సెమిస్ లో అడుగు పెడతారు
తాజావార్తలు
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!