Vijay: “విజయ్‌కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య
- విడాకులు కోరిన విజయ్ భార్య..
- తన భర్తకు ఎఫై ర్ ఉందని పిటిషన్..
- తలపతి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. తన భర్త విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. విజయ్ , సంగీతలకు ఆగస్టు 25, 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినీ నటితో వివాహేతర సంబంధమే విడాకులకు కారణమని పిటిషన్‌లో పేర్కొంది. చెంగల్పట్టు కోర్టులో ఆమె డైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 20న తమ ముందు హాజరుకావాలని కోర్టు విజయ్‌కు సమన్లు జారీ చేసింది.
Read Also: Pakistan Afghanistan War: పాక్ ప్రధాని ఆఫీసుకు 5 కి.మీ దూరంలో ఆఫ్ఘాన్ దాడి.. వణికిన ఇస్లామాబాద్..
Also Read
పెళ్లయిన 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నుంచి సంగీత విజయ్‌తో విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. విజయ్ ఇటీవల ఓ స్టార్ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత విడాకులు కోరడం తమిళనాట సంచలనంగా మారింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్, తన పార్టీ టీవీకే ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో భార్య విడాకులు కోరారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించనుంది.
విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్యా షాషా ఉన్నారు. జాసన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. 2021లో తన భర్తకు సినీ నటిలో ఎఫైర్ ఉందని కనుగొన్నానని, దీంతోనే చట్టబద్ధంగా విడిపోవాలని అనుకుంటున్నట్లు సంగీత పేర్కొన్నారు. విజయ్ ఎఫైర్ ముగుస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, అది అలాగే కొనసాగిందని పిటిషన్ పేర్కొంది. విజయ్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ఆమె ఆరోపించారు. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద ఆమె విడాకులు కోరింది. ఈ సెక్షన్లు వివాహేతర సంబంధం, క్రూరత్వాన్ని సూచిస్తాయి. విజయ్ తనపై క్రూరత్వానికి పాల్పడినట్లు సంగీత పేర్కొంది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!