Ravichandran Ashwin: “యువరాజ్ కంటే అభిషేక్ బెటర్”.. పాకిస్థాన్ మాజీ పేసర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన అశ్విన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అభిషేక్‌ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలించాలని గట్టిగానే వాదనలు వినిపించాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో అభిషేక్ శర్మ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) తీవ్రంగా వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో అభిషేక్ వరుసగా విఫలమవుతుండగా, “అతనికి డిఫెన్సివ్ గేర్ ఏదీ లేదు.. కేవలం స్లోగర్ మాత్రమే” అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే.. తాజాగా స్పిన్నర్ అశ్విన్ ఘాటుగా సమాధానమిచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్ ‘Ash Ki Baat’లో మాట్లాడిన అశ్విన్.. అభిషేక్ శర్మ యువరాజ్ కంటే మెరుగ్గానే ఆడుతున్నాడ చెప్పాడు. “అభిషేక్ స్లోగర్ కాదు. ప్రస్తుతం క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్ స్వింగ్స్‌లో ఒకడు. అతని మెంటర్ యువరాజ్ సింగ్. నిజం చెప్పాలంటే యూవీ కంటే కూడా మంచి బ్యాట్ స్వింగ్ అభిషేక్‌కి ఉంది. అభిషేక్ బంతిని బాదితే చాలా దూరం వెళ్తుంది. అందుకే కొందరికి అభి స్లోగర్‌లా అనిపిస్తాడు. ఇది ముమ్మాటికీ తప్పుడు వ్యాఖ్య” అని స్పష్టం చేశాడు. అశ్విన్ మరో కీలక విషయాన్ని వెల్లడించాడు. అభిషేక్ పవర్‌పై కాకుండా టైమింగ్‌పై దృష్టి పెట్టాలి. “అతను ప్రతి షాట్‌లో శక్తి పెట్టాల్సిన అవసరం లేదు. సరిగ్గా టైమ్ చేస్తే చాలు, బంతి తన పని తాను చేస్తుంది,” అని సూచించాడు. బ్యాటింగ్ కోచ్‌లు సైతం అభికి అదే చెప్పాలని సూచించాడు.
Also Read
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్‌లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
- IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
ఇక.. గ్రూప్ స్టేజ్‌లో అభిషేక్ పరిస్థితి నిజంగానే క్లిష్టంగా మారింది. యూఎస్‌ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై డక్స్, అలాగే సూపర్ 8లో దక్షిణాఫ్రికాపై కేవలం 15 పరుగులు చేయడంతో ఫామ్‌పై సందేహాలు వ్యక్త మయ్యాయి. మధ్యలో కడుపు ఇన్‌ఫెక్షన్ కారణంగా నమీబియా మ్యాచ్ మిస్ కావాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందడంతో పాటు కొంత బరువు సైతం తగ్గాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనిపై వచ్చిన విమర్శలు మరింత ఒత్తిడి సృష్టించాయి. అయితే జింబాబ్వేపై మ్యాచ్‌లో 30 బంతుల్లో 55 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అభిషేక్ గట్టిగా సమాధానం ఇచ్చాడు.
READ MORE: New Rules for 1st March: మార్చి 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. వంటగది నుండి ప్రయాణాల వరకు ప్రభావం!
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!