దోమలు లేదా ఏదైనా కీటకాలు కుట్టిన చోట అరటి తొక్క రుద్దితే.. మంట, దురద తగ్గుతుంది.

ఇందులో పీచు పదార్థాలుంటాయి. కాబట్టి.. దీన్ని తింటే, మలవిసర్జన సాఫీగా అవుతుంది.

తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రెండు వారాలపాటు రుద్దితే.. దంతాలు తెల్లగా మారుతాయి.

అరటి తొక్కను ముఖంపై రుద్ది.. కాసేపయ్యాక కడిగితే, ముఖంపై మొటిమలు - ముడతలు తగ్గుతాయి.

తొక్క లోపలి భాగాన్ని తరుచుగా తింటే.. కంటి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తొక్కలోని పీచు పదార్థాలు కొలెస్టిరాల్‌ని కరిగించి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.

అరటి తొక్కను పులిపిర్లపై బ్యాండ్ ఎయిడ్‌తో పట్టీలా కొన్ని రోజులు పెడితే.. ఆ పులిపిర్లు రాలిపోతాయి.

తొక్కలో ఉండే అమైనో ఆమ్లాలు.. మంచి మూడ్ కలిగించే హార్మోన్లను విడుదల చేస్తాయి.

ఎముకలకు కావాల్సిన కాల్షియం తొక్కలో ఉంటుంది. కాబట్టి, వీటిని తింటే ఎంతో మేలు.

ఈ తొక్కలను తింటే.. అందులో ఉండే పొటాషియం, హైబీపీని అదుపులో ఉంచుతుంది.