Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
- యుద్ధ పరిస్థితుల మధ్య గ్యాస్ సరఫరాపై ప్రభుత్వ స్పష్టత
- తప్పుడు ప్రచారాలతో పెరిగిన పానిక్ బుకింగ్స్
- డొమెస్టిక్ వినియోగదారులకు ప్రాధాన్యత.. కమర్షియల్ సిలిండర్లపై పరిమితి
- పెట్రోల్, డీజిల్ కొరత వార్తలను ఖండించిన చమురు సంస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, అయినప్పటికీ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం అదనపు స్టాక్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సిలిండర్ డెలివరీలు ఎక్కడా ఆటంకం లేకుండా స్మూత్ గా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. సాధారణంగా గ్యాస్ బుకింగ్ కోసం ఉండే 21 రోజుల స్టాండర్డ్ క్యాప్‌ను ప్రస్తుతం ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 50 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లకు, అందులోనూ ముఖ్యంగా ఉజ్వల యోజన కింద ఉన్న 50 లక్షల కనెక్షన్లకు నిరంతరాయంగా సరఫరా అందుతోంది. అయితే, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొత్త కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ , డీజిల్ కొరత వార్తలను కూడా ప్రభుత్వం , చమురు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. HPCL, BPCL, , IOCL వంటి సంస్థలు దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
తాజావార్తలు
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?