CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..
- నల్ల చెరువుకు గంగా హారతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- హైడ్రా ఆధ్వర్యంలో పూర్తైన చెరువు పునరుద్ధరణ పనులు
- చెరువుల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం
- మూసీ ప్రక్షాళనతో నగర భవిష్యత్తు కాపాడాలన్న పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైడ్రా పునరుద్దరించిన నల్ల చెరువుకు గంగా హారతి ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కలుషితమై, కబ్జాలకు గురైన నల్ల చెరువు నేడు సుందరమైన పర్యాటక ప్రాంతంగా మారడం తనకెంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. తాను గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న సమయంలో నిధుల కొరత వల్ల చేయలేకపోయిన అభివృద్ధిని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
హైడ్రా కార్యకలాపాలు ప్రారంభించిన సమయంలో ఎదురైన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణలను మౌనంగా భరించానని, కానీ నేడు ఈ మార్పును చూసి ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆనందం తనకు ఆశీర్వాదంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. చెరువుల పరిరక్షణలో భాగంగా అనివార్యంగా నివాసాలు కోల్పోయిన పేదల పట్ల ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చెరువులు కబ్జాకు గురైతే భవిష్యత్తులో వరదలు వచ్చి సామాన్య ప్రజల ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఆక్రమణదారులు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ పునరుద్ధరించిన ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అలాగే స్థానికుల కోరిక మేరకు షటిల్ కోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Bengaluru Hotels Shutdown: హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత.. రేపు హోటల్స్ బంద్‌కు పిలుపు
నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘మూసీ ప్రక్షాళన’ ఎంత అవసరమో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల పార్లమెంటుకు, స్కూళ్లకు సెలవులు ఇచ్చే దుస్థితి వచ్చిందని, ముందుచూపు లేకపోవడం వల్లే ముంబై వంటి నగరాలు వర్షం పడితే స్తంభించిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకూడదంటే మూసీ నదిని శుభ్రం చేయాల్సిందేనని, దీనిని అడ్డుకోవడం అంటే నగర భవిష్యత్తును అడ్డుకోవడమేనని హెచ్చరించారు. అభివృద్ధి కోసం ఎంతటి కష్టమైనా పడతానని, అవసరమైతే అప్పు తెచ్చైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని భావోద్వేగంగా మాట్లాడారు. సరైన పత్రాలు ఉన్న వారికి టీడీఆర్ (TDR) ఇస్తామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!