Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..
- రూపాయికే బ్రాండెట్ షూ అంటూ ప్రకటన..
- భారీగా తరలివచ్చిన జనాలు..
- కేరళంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మంచి బ్రాండెడ్ షూ ధరించాలని ఎవరికి ఉండదు చెప్పండి..? అందుకే మార్కెట్లో వేల రూపాయల ధర పలికే స్పోర్ట్స్ షూస్ లేదా స్నీకర్స్ కనిపిస్తే కుర్రకారు నుంచి పెద్దల వరకు అందరూ వాటి వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే ఇటువంటి బ్రాండెడ్ ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయికి మాత్రమే విక్రయిస్తామని పేర్కొన్నారు ఆ షాపు యజమానాలు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా తీవ్రంగా ప్రచారం చేశారు. అనుకున్న విధంగానే జనాలు గుంపులు గుంపులుగా ఆ షాపు వద్దకు కదిలి వచ్చారు.
అసలేం జరిగింది?
కేరళంలోని కోజికోడ్‌లో ఉన్న ఒక షూ షాపు యజమానులు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒక వినూత్న ప్రచారానికి తెరలేపారు. కేవలం ఒక్క రూపాయికే బ్రాండెడ్ షూ అందిస్తామని వారు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. వేల రూపాయల విలువైన షూస్‌ను కేవలం రూపాయికే ఇస్తున్నారనే సరికి జనం ఎగబడ్డారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Also Read:Andhra Pradesh Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. వారికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఆదివారం ఉదయం నుంచే వేల సంఖ్యలో ప్రజలు సదరు షాపు వద్దకు చేరుకున్నారు. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. క్యూలైన్లు పాటించకపోవడంతో తోపులాట మొదలైంది. షాపు వద్ద పరిస్థితి బీభత్సంగా మారడమే కాకుండా.. సమీపంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read:Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీగా చేరుకున్న జనాలను చెల్లాచెదురు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ముందస్తు అనుమతులు లేకుండా.. ప్రజా భద్రతను గాలికొదిలేసి ఇలాంటి ప్రమాదకరమైన ప్రచార స్టంట్లు నిర్వహించినందుకు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను సదరు షాపు యజమానులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!