US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలోనే తొలిసారి.. నడి సముద్రం నుండి వెనక్కి 10,000 కంటైనర్లు.!
- హర్మూస్ జలసంధి ఉద్రిక్తతలతో ఆగిపోయిన నౌకలు
- విశాఖ పోర్టుకు తిరిగి వస్తున్న 10,000 కంటైనర్లు
- ఎగుమతిదారులకు భారీ నిర్వహణ ఖర్చుల భారం
- సీఫుడ్ , ఫార్మా ఎగుమతులపై నాణ్యత ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Israeli war: పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. హర్మూస్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, విశాఖ పోర్టు నుండి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు, నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలోనే ఎగుమతి అయిన సరుకు ఈ స్థాయిలో రివర్స్ రావడం ఇదే మొదటిసారి.
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
సుమారు 10,000 కంటైనర్లు తిరిగి విశాఖ తీరానికి చేరుకోనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ నుండి ప్రధానంగా సీఫుడ్ (రొయ్యలు, చేపలు), ఫార్మా ఉత్పత్తులు, , జీడిపప్పు వంటి విలువైన సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఈ సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని నిరంతరం శీతలీకరణ యంత్రాల్లో (Refrigerated Containers) ఉంచాలి. అయితే, వీటిని యార్డుల్లో భద్రపరచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో కంటైనర్‌కు రోజుకు సుమారు ₹5,000 వరకు విద్యుత్ బిల్లు అయ్యే అవకాశం ఉందని లెక్కగట్టారు. దీనివల్ల వచ్చే లాభం కంటే నిర్వహణ ఖర్చే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
ఒకేసారి వేల సంఖ్యలో కంటైనర్లు తిరిగి వస్తుండటంతో పోర్టులో స్థల కొరత ఏర్పడింది. ఈ కంటైనర్లను ఉంచడానికి కనీసం 16,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టెర్మినల్ అధికారులు పోర్ట్ ట్రస్ట్‌కు లేఖ రాశారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు , టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఎగుమతి అయ్యే సరుకుపై ఉండే నిబంధనలు, తిరిగి వచ్చే సరుకుకు వర్తించవు కాబట్టి, కస్టమ్స్ విభాగం కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించే పనిలో పడింది.
ఎగుమతిదారుల ప్రధాన ఆందోళన సరుకు నాణ్యతపైనే ఉంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులను 3 నుండి 5 రోజులకు మించి నిల్వ చేయడం కష్టసాధ్యం. నౌక ప్రయాణంలో ఉన్నప్పుడు ఉండే అత్యాధునిక ప్రిజర్వేషన్ సౌకర్యాలు, పోర్టులోని యార్డుల్లో ఉండకపోవచ్చు. దీనివల్ల వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా అరేబియా సముద్రం , గల్ఫ్ దేశాల వైపు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం, ఈ ఎగుమతులకు మోక్షం లభించేలా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!