Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండండి.. ఓట్లు తొలగించకుండా జాగ్రత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా పార్టీకి చెందిన ఓట్లు తొలగించబడకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో పార్టీ బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మన పార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు. తెలంగాణలో ఇంటింటి సర్వే జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా సవరణ పనులు ప్రారంభించినట్లు సమాచారం ఉందని సజ్జల తెలిపారు. అందువల్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించి పార్టీ ఓటర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక
Also Read
- Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
- Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
- AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
- AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ ఆగడాలు మరియు పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న తీరుపై మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ముందుగానే వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువెళ్లడం, పార్టీకి చెందిన ఓట్లు తొలగించకుండా కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం పార్టీకి సుమారు 16 లక్షల మంది నెట్వర్క్ ఏర్పాటయ్యిందని, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
-
Parvinder Awana: రెండు టీ20లే ఆడిన మాజీ పేసర్‌కు బీసీసీఐ కీలక పదవి.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పర్వీందర్..
-
Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!