BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
- తీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు..
- ఇండోనేషియా భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలని నిర్ణయం..
- వచ్చే 2–3 నెలల్లో భారత్-ఇండోనేషియా మధ్య అధికారిక ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
సమాచారం ప్రకారం మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీని కొనుగోలు చేయనుంది. అనంతరం దానిని దశలవారీగా పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఇండోనేషియా రక్షణ మంత్రి స్యాఫ్రి స్యామ్‌సోయెద్దీన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్‌ను బహుమతిగా అందజేశారు. ఈ పర్యటన అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది.
Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!
ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి మూడు బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిగా గుర్తింపు ఉంది. ఇందులో ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది యాంటీ-షిప్, భూభాగంపై దాడులు, తీర రక్షణ వంటి అనేక మిషన్లలో ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు