8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find N6 Launch: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఒప్పో’ మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. కంపెనీ త్వరలోనే OPPO Find N6 అనే కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గత ఏడాది విడుదలైన OPPO Find N5 కు అప్డేటెడ్ గా ఈ ఫోన్ వస్తోంది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. మార్చి 17న గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు OPPO Watch X3 స్మార్ట్‌వాచ్‌ను కూడా కంపెనీ పరిచయం చేయబోతోంది.
ICC T20 World Cup: ఏంటి..! టీమిండియాకు ఇచ్చిన ట్రోఫీ ఒరిజినల్ కాదా? షాకింగ్ నిజం..
Also Read
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
- OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా కనిపించే సమస్య స్క్రీన్ మధ్యలో వచ్చే మడత. అయితే Find N6లో కొత్త జనరేషన్ టైటానియం అలాయ్ డోమ్ హింజ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల స్క్రీన్ మడత దాదాపు కనిపించదని, దీర్ఘకాలం ఉపయోగించినా డిస్‌ప్లే స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 8.12 అంగుళాల 2K LTPO ప్రధాన డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగే బయట భాగంలో 6.62 అంగుళాల సెకండరీ స్క్రీన్ ఉంటుంది.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. ఈ ఫోన్ కెమెరా వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో 200 MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.
Find N6లో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా AI స్టైలస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది కేవలం నోట్ తీసుకోవడానికి మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 16GB RAM & గరిష్టంగా 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకర్షణీయమైన కొత్త రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
Unmatched flatness. Superbly smooth.
The #OPPOFindN6 is coming soon. #UltimateFlatFold pic.twitter.com/zxOiqfWZkB
— OPPO (@oppo) March 9, 2026
తాజావార్తలు
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!