రివ్యూ : సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Sivaji, Laya, Rohan
- DIRECTOR: Sudheer Sriram
- MUSIC: Ranjin Raj
- PRODUCER: Sivaji Sontineni
శివాజీ ప్రధాన పాత్రలో, లయ హీరోయిన్‌గా, చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని’. హ్యాష్ ట్యాగ్ 90s వెబ్ సిరీస్‌లో బాగా వైరల్ అయిన పాటలోని పదాలతో టైటిల్ పెట్టడంతో, ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపొందించబడిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో ప్రమోషన్ కంటెంట్ అంచనాలు పెంచింది. అయితే సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ: శ్రీరామ్ (శివాజీ), చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకాలోని ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటాడు. నీతికి, నిజాయితీకి మారుపేరైన శ్రీరామ్, ఎలాంటి అవినీతికి లొంగకుండా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య ఉత్తర (లయ), కొడుకు రోహన్‌తో సరదా సరదాగా జీవితం గడిపేస్తూ ఉంటాడు. అయితే ఆ ఊరి ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) వీరి ఇంటికి వచ్చి చనిపోవడంతో, ఒక్కసారిగా ఈ కుటుంబం అంతా ఆ నేరం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శ్రీరామ్ ఏం చేశాడు? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ: నిజానికి ఫ్యామిలీ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లే కథలు మనం గతంలో ఎన్నో చూశాం. దాదాపుగా ఇది కూడా అలాంటి కథే. అసలు అవినీతి అంటే ఎరుగని శివాజీ, ఆ అవినీతి కారణంగా తన ఫ్యామిలీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎంతవరకు వెళ్ళాడు అనేది ఆసక్తికరంగా చూపించారు. అయితే నిజానికి టైటిల్ తో పాటు ప్రమోషన్స్ చూస్తే, ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా అని ఎవరూ భావించరు. కానీ వీరి కాంబినేషన్ వస్తుందంటే, కచ్చితంగా కామెడీ ఎంతో కొంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ కామెడీ పూర్తిస్థాయిలో తెరమీద పండలేదు. క్రమంలో దర్శకుడు కథగా రాసుకున్న పాయింట్ బాగుంది గాని, దాన్ని పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ పరిచయం, తర్వాత ఎస్సై పరిచయంతో ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత ఎస్సై మరణం నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ఎస్సైని చంపింది ఎవరు అనే విషయం అందరూ భావించినట్లుగా కాకుండా, చివరిలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.
ఫస్ట్ హాఫ్ మధ్య నుంచి సెకండ్ హాఫ్ మధ్య వరకు ఆ ఫ్యామిలీ ఆ శవాన్ని మాయం చేయడానికి చేసే ప్రయత్నాలు, మధ్యలో వచ్చే ఆటంకాలు ఇలా ఆసక్తికరంగా సాగుతూ, చివర్లో ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
నటీనటులు: నటీనటుల విషయానికి వస్తే, శివాజీ ఎప్పటిలాగే తన పాత్రలో పూర్తిస్థాయిలో మెరిశాడు. లయతో కెమిస్ట్రీ కూడా బానే వర్కవుట్ అయింది. లయ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించింది. రోహన్ కామెడీ వర్కవుట్ కాలేదు, ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. ఇక ప్రిన్స్ పాత్ర చాలా పరిమితం, మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక ఈ సినిమాలో ‘పాయ పాయ’ సాంగ్ ఒక్కటే గుర్తుంచుకునేలా ఉంది, మిగతా పాటలు ఏవి పెద్దగా లేవు. నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. నిడివి సినిమాకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా, ఎందుకో నిడివి మాత్రం ఎక్కువ ఉంచే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
ఓవరాల్‌గా: ‘సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని’ ఓ సారి చూసేయచ్చు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..