Bengaluru Hotels Shutdown: హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత.. రేపు హోటల్స్ బంద్‌కు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Hotels Shutdown: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా గ్యాస్ ధరలపై ప్రభావం పడుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్–అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో హోటల్ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను కొన్ని గ్యాస్ కంపెనీలు నిలిపివేయడంతో బెంగుళూరు హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని అసోసియేషన్ పేర్కొంది.
Read Also: Phosphorus Bomb Explained: ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఫాస్ఫరస్ బాంబు ఏమిటి?.. దీంతో అనర్థాలు ఏంటి..?
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
బెంగుళూరులో సుమారు 35 వేలకుపైగా చిన్నా పెద్దా హోటళ్లు ఉన్నాయి. అయితే నిన్నటి నుంచి చాలా హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో ఆహార తయారీ పూర్తిగా ప్రభావితమైంది. దీంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగుళూరు హోటల్ అసోసియేషన్ రేపు హోటళ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చింది. కమర్షియల్ గ్యాస్ అందకపోతే హోటళ్లను నిర్వహించడం అసాధ్యమవుతుందని వారు తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరా పునరుద్ధరించే వరకు చాలా హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని అసోసియేషన్ పేర్కొంది. అయితే గ్యాస్ సరఫరాను వెంటనే పునఃప్రారంభిస్తే హోటళ్లు మునుపటిలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని హోటల్ అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ కంపెనీలు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!