Lakshmi Manchu: ‘పుష్ప సినిమాలో ఆ డైలాగ్ నాదే’: మంచు లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Manchu: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప, పుష్ప 2. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ లెక్కలను మార్చివేశాయి. అంతటి ఘన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాల్లో ఎన్నో ఐకానిక్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక డైలాగ్.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!” – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ డైలాగ్‌ను ‘పుష్ప’ కంటే ముందే తాను ఒక సినిమాలో చెప్పానంటూ తాజాగా నటి మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: CM Revanth Reddy : మండలానికి ఒక పోలీస్ స్టేషన్.. పని భారం తగ్గిస్తాం.. సీఎం రేవంత్ కీలక హామీలు.!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర పేరు కూడా ‘పుష్ప’ కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “దర్శకుడు సుకుమార్ గారికి నేనొక విషయం చెప్పాలి. ‘ఫ్లవర్ కాదు ఫైర్’ అని ముందు నేనే చెప్పానండీ. మా సినిమా షూటింగ్ పుష్ప కంటే ముందే పూర్తయింది. కానీ అప్పటికి మా డైలాగ్ బయటకు రాలేదు. పుష్ప టీజర్‌లో ఆ డైలాగ్ వినగానే.. అరే ఇది నా డైలాగ్ కదా అని చాలా ఫీల్ అయ్యాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనన్య నాగళ్ల, శ్రద్ధాదాస్, హరితేజ, హేమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా నిర్మాణంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి సినిమాలు నిర్మించే ఆలోచన లేదని మంచు లక్ష్మి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!