వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajaj PX 97: వేసవి కాలం మొదలైతే ఇంట్లో చల్లదనం కోసం చాలా మంది ఏసీ కొనాలని అనుకుంటారు. కానీ అధిక ధరల కారణంగా ప్రతి ఒక్కరికీ అది సాధ్యం కాదు. అలాంటి వారికి మంచి ప్రత్యామ్నాయం ఎయిర్ కూలర్. ముఖ్యంగా వ్యక్తిగత గదులు లేదా చిన్న కార్యాలయాల కోసం సరసమైన ధరలో మంచి పనితీరు అందించే కూలర్‌గా Bajaj PX 97 Torque 36L Air Cooler నిలుస్తోంది. ప్రముఖ సంస్థ బజాజ్ ఎలక్ట్రికల్స్ తయారు చేసిన ఈ కూలర్ వేసవి వేడిని తగ్గించడంలో మంచి పనితీరు చూపుతుంది.
Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ కూలర్‌లో 36 లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంక్ ఉంటుంది. దీని వల్ల తరచూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి నీళ్లు నింపితే చాలా సేపు కూలింగ్ అందిస్తుంది. రాత్రంతా నిరంతరంగా ఉపయోగించుకునేలా ఇది డిజైన్ చేయబడింది. ఇంకా ఇందులో ప్రత్యేకంగా హెక్సాకూల్ టెక్నాలజీతో కూడిన హనీకాంబ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి తక్కువ నీటితో కూడా గాలిని వేగంగా చల్లబరచగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీని వల్ల గది త్వరగా చల్లబడుతుంది.
టర్భో ఫ్యాన్ టెక్నాలజీ కారణంగా ఈ కూలర్ గాలిని సుమారు 30 అడుగుల దూరం వరకు వియగలదు. దీంతో చిన్న గదులు లేదా మధ్యస్థ గదుల్లో కూడా చల్లదనం సమంగా వ్యాపిస్తుంది. ఈ కూలర్‌లో ఉన్న దురామెరైన్ పంప్ సాధారణ పంపుల కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. దీనిపై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీ కూడా ఇస్తుంది. దీని వల్ల కూలర్ ఎక్కువకాలం ఉపయోగించుకునేలా ఉంటుంది. ఈ కూలర్‌లో 4-Way Deflection సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా గాలి గదిలోని ప్రతి మూలకు చేరేలా డిజైన్ చేశారు. దీంతో గదిలో ఎక్కడ కూర్చున్నా చల్లదనం అనుభూతి కలుగుతుంది.
Hyderabad: డిజిటల్ అరెస్ట్.. ఏకంగా రిటైర్డ్ జడ్జీనే టార్గెట్ చేసి రూ.1.66 కోట్ల టోకరా..
విద్యుత్ కోతలు ఉన్నప్పుడు కూడా ఈ కూలర్ ఇన్వర్టర్‌పై సులభంగా పనిచేస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు లేదా తరచూ పవర్ కట్ ఉండే ప్రాంతాల్లో ఇది మంచి ఎంపికగా ఉంటుంది. ఇక ఈ కూలర్ అసలు ధర సుమారు రూ. 9,790 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ లో భారీ డిస్కౌంట్‌లతో సుమారు రూ. 5,699కే లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ లేదా నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా పొందవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?