Dhurandhar 2: “ధురంధర్” కోసం ఫిన్లాండ్ దేశాధినేత ఎదురుచూపులు..
- ఫిన్లాండ్ అధ్యక్షుడు మెచ్చిన ‘‘ధురంధర్’’..
- సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పిన అలెగ్జాండర్ స్టబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: ‘‘ధురంధర్’’ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. పాకిస్తాన్‌లో ఇండియన్ స్పై డ్రామాగా తెరకెక్కిన ధురంధర బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. నిషేధం విధించినప్పటికీ పాకిస్తాన్ వ్యాప్తంగా ఈ సినిమాను చూశారు. అయితే, ఇప్పుడు ‘‘ధురంధర్-2’’ మార్చి 19న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాలో యూరప్ దేశమైన ఫిన్లాండ్ దేశాధినేత ఉండటం గమనార్హం. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రస్తుతం రణవీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. తన కొడుకు సలహా మేరకు భారత్ రాకముందే ఈ సినిమా చూశానిని, ఇప్పుడు దాని సీక్వెల్ ‘‘ధురంధర్-2: ది రివెంజ్’’ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
మార్చి 4 నుండి 7 వరకు భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉన్న అలెగ్జాండర్ స్టబ్ మాట్లాడుతూ.. తన కొడుకు ఈ సినిమా చూడాలని పట్టుబట్టారని అన్నారు. “భారతదేశానికి రాకముందు, నా కొడుకు నన్ను ‘ధురంధర్’ చూడమని అడగడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. నేను సినిమా చూశాను. ఉగ్రవాదంపై పోరాటం గురించి దాని కథను పూర్తిగా ఇష్టపడ్డాను. ఇప్పుడు మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ మార్చి 7న రిలీజ్ అయింది. మరోసారి రణ్‌వీర్ సింగ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. ‘‘జస్కిరత్ సింగ్ రంగి’’ పాత్రలో రణవీర్ నట విధ్వంసాన్ని చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. రణ్‌వీర్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!