SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!
- అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక
- ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన శాప్ చైర్మన్
- చంద్రికకు శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాప్ (ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ) చైర్మన్ రవి నాయుడు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రిక త్వరగా కోలుకోవాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్రీడాకారిణి చంద్రికకు ప్రోత్సాహంగా శాప్ చైర్మన్ రవి నాయుడు రూ.1 లక్ష నగదు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన క్రీడాకారిణిగా చంద్రికను ఆయన అభినందించారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ క్రీడా రంగంలో రాణించాలని శాప్ చైర్మన్ ఆకాంక్షించారు. 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో, 2019 ఆసియా పసిఫిక్ ఛాంపియన్‌షిప్‌లో చంద్రిక స్వర్ణ పతకాలు (స్క్వాట్, డెడ్‌లిఫ్ట్) సాధించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఆమె ప్రసిద్ధి చెందారు.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
Also Read: Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
చంద్రికను పరామర్శించిన అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి అవసరమైన సహాయం అందిస్తాము. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చంద్రిక భవిష్యత్ టోర్నమెంట్లలో కూడా రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. చంద్రిక పోరాట స్ఫూర్తి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!