Farmers Loan: అప్పుల ఊబిలో అన్నదాత.. దేశవ్యాప్తంగా రూ.31 లక్షల కోట్ల రుణాలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Loan: దేశంలో అన్నదాతలపై పెరుగుతున్న అప్పుల భారంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక సమాచారాన్ని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ సభ్యులు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా రైతుల మొత్తం రుణాలు రూ.31,34,807 కోట్లుగా ఉన్నాయి.
READ ALSO: Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
వీటిలో..
క్రాప్ లోన్స్ (పంట రుణాలు): రూ. 20.17 లక్షల కోట్లు
టర్మ్ లోన్స్ (దీర్ఘకాలిక రుణాలు): రూ. 11.17 లక్షల కోట్లు
రాష్ట్రాల వారీగా రుణాల వివరాలు..
రైతుల అప్పుల విషయంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి.
తమిళనాడు: దేశంలోనే అత్యధికంగా రైతుల అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్: రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2025 డిసెంబర్ 31 నాటికి ఏపీ రైతులపై మొత్తం రూ. 3,75,254 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో పంట రుణాలు రూ. 2,01,744 కోట్లు కాగా, టర్మ్ లోన్స్ రూ. 1,73,510 కోట్లుగా ఉన్నాయి.
తెలంగాణ: తెలంగాణలో రైతులపై మొత్తం రూ. 1,75,960 కోట్ల అప్పుల భారం ఉందని కేంద్రం తెలిపింది. ఇందులో పంట రుణాలు రూ. 95,167 కోట్లు కాగా, టర్మ్ లోన్స్ రూ. 80,792 కోట్లుగా ఉన్నాయి.
రైతుల రుణభారం పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ భారం అధికంగా ఉన్నట్లు కేంద్రం గణాంకాలు సూచిస్తున్నాయి. అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ రుణాల నుంచి విముక్తి కల్పించే వ్యూహాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!