Mohabbat Ka Sharbat: వేసవిలో అదిరిపోయే హెల్దీ డ్రింక్! తక్కువ టైంలో.. సింపుల్‌గా పుచ్చకాయతో ఇలా చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohabbat Ka Sharbat: ఎండలు మండుతున్న వేళ శరీరాన్ని చల్లబరిచే పానీయాల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం పుచ్చకాయతో కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే ‘మొహబ్బత్ కా షర్బత్’ రెసిపీ సూపర్ ఛాయిస్ అని చెబుతున్నారు. వేసవి కాలంలో ఈ డ్రింక్ ఎంతో ఎనర్జిటిక్‌గా, టేస్టీగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gary Kirsten: భారతదేశం T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్యారీ కిర్‌స్టన్‌కు కొత్త బాధ్యతలు..
Also Read
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
కావలసిన పదార్థాలు:
కాచి చల్లార్చిన పాలు – అర లీటరు
పంచదార – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
రోజ్ సిరప్ – 3 టేబుల్ స్పూన్లు
పుచ్చకాయ ముక్కలు – ఒకటిన్నర కప్పు
నానబెట్టిన సబ్జా గింజలు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్ – తగినన్ని
తయారీ విధానం..
ముందుగా అర లీటరు పాలలో పంచదార వేసి కరిగే వరకు కలపాలి. ఈ పాలను అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబరచాలి. పుచ్చకాయ నుంచి గింజలను సులభంగా వేరు చేసేందుకు, దానిని మూన్ షేప్‌లో కట్ చేసి, గింజలు ఉన్న లైన్ వద్ద బ్రేక్ చేయాలి. దీనివల్ల గింజలు త్వరగా బయటకు వస్తాయి. ఆ తర్వాత పల్ప్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఫ్రిజ్ లో నుంచి పాలను తీసి అందులో రోజ్ సిరప్, నానబెట్టిన సబ్జా గింజలు, పుచ్చకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. చివరగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. మరింత రుచి, ఆరోగ్యం కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన బాదం గమ్ కూడా జోడించవచ్చు. తక్కువ టైంలో.. సింపుల్‌గా తయారయ్యే ఈ హెల్దీ డ్రింక్ వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పంచదారకు బదులుగా కండెన్స్డ్ మిల్క్ వాడితే ఈ షర్బత్ మరింత రిచ్ టేస్ట్‌ను ఇస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే ట్రై చేసి చల్లగా ఎంజాయ్ చేయండి.
READ ALSO: Domestic Flour Mill: తక్కువ టైంలో హెల్దీ చపాతీలు.. గోధుమలు రుబ్బే హోమ్ మిషన్స్ ధర ఎంతంటే!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!