Gen Z Reality : 23 ఏళ్లకే పచ్చి తాగుబోతులుగా మారుతున్న యువత..!
- Gen Zలో మితిమీరిన మద్యం అలవాటు పెరుగుతోంది
- యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతుంది
- వేపింగ్ , ఇతర కొత్త వ్యసనాలు
- జూదం, వ్యసనాల ప్రభావం పై హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి తరం యువత (Gen Z) గురించి సమాజంలో ఒక సానుకూల అభిప్రాయం ఉండేది. వారు పాత తరాల కంటే చాలా స్పృహతో ఉంటారని, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారని, వ్యసనాలకు దూరంగా ఉంటారని చాలా మంది భావించేవారు. అందుకే వారిని ‘జనరేషన్ సెన్సిబుల్’ అని కూడా పిలిచేవారు. అయితే, ఇప్పుడు వస్తున్న కొత్త పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ లాంగిట్యుడినల్ స్టడీస్ నిర్వహించిన ఒక భారీ అధ్యయనం, యువత ప్రవర్తనలో కనిపిస్తున్న ఆందోళనకరమైన మార్పులను ప్రపంచం ముందుకు తెచ్చింది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ పరిశోధనలో భాగంగా 2000 నుంచి 2002 మధ్య జన్మించిన సుమారు 10,000 మంది యువతను దాదాపు ఆరేళ్ల పాటు గమనించారు. వారు 17 ఏళ్ల టీనేజ్ దశలో ఉన్నప్పుడు వారి అలవాట్లు ఎలా ఉన్నాయి, 23 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టేసరికి అవి ఎలా మారాయో నిపుణులు విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా ‘బెంజ్ డ్రింకింగ్’ (మితిమీరిన మధ్యపానం) అనే అలవాటు యువతలో వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. 17 ఏళ్ల వయసులో 53 శాతంగా ఉన్న ఈ అలవాటు, 23 ఏళ్లకు వచ్చేసరికి ఏకంగా 68 శాతానికి పెరిగింది. అంటే మెజారిటీ యువత ఏడాదిలో కనీసం ఒక్కసారైనా నియంత్రణ కోల్పోయేలా మద్యం సేవించామని అంగీకరించారు.
మద్యం మాత్రమే కాకుండా, డ్రగ్స్ వినియోగం కూడా ఈ తరంలో భయంకరంగా పెరుగుతోంది. 17 ఏళ్ల వయసులో 31 శాతంగా ఉన్న గంజాయి వినియోగం, కేవలం ఆరేళ్ల వ్యవధిలో 49 శాతానికి చేరుకుంది. దీనికంటే మించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కొకైన్ , కెటమైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన హార్డ్ డ్రగ్స్ వాడే వారి సంఖ్య 10 శాతం నుండి 32 శాతానికి పెరిగింది. మరోవైపు వేపింగ్ (ఇ-సిగరెట్లు) సంస్కృతి కూడా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. 17 ఏళ్లప్పుడు కేవలం 3 శాతంగా ఉన్న వేపింగ్ అలవాటు, 23 ఏళ్ల నాటికి 19 శాతానికి పెరిగింది.
High Protein Soya Chilla Recipe: మంచి ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్.. సోయా చిల్లా రెసిపీ సింపుల్‌గా ఇలా..
వ్యసనాల జాబితాలో ‘గాంబ్లింగ్’ (జూదం) కూడా ప్రధానంగా నిలిచింది. 23 ఏళ్ల వయసులో సుమారు 32 శాతం మంది యువత కనీసం ఒక్కసారైనా జూదం ఆడినట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ జూద వ్యసనం 7 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. మెదడు అభివృద్ధి అనేది సాధారణంగా 25 ఏళ్ల వయసు (మిడ్ 20స్) వరకు జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే వయసులో యువత ఇలాంటి తీవ్రమైన వ్యసనాలకు లోనవ్వడం వల్ల వారి మెదడు ఆరోగ్యం , భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రయోగాల పేరుతో చేస్తున్న ఈ పనులు చివరకు వారి జీవితాలనే అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!