Stop Eating 3 Hours Before Sleep: పడుకునే 3 గంటల ముందే భోజనం ముగిస్తే ఏం జరుగుతుంది..? స్టడీలో వెలుగులోకి కీలక అంశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stop Eating 3 Hours Before Sleep: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.. లైఫ్ స్టైల్‌లో చేసుకునే చిన్నపాటి మార్పులే.. ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి.. ఇక, పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల రక్తపోటు మరియు రక్తంలో షుగర్ లెవల్స్ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. World Health Organization (WHO) ప్రకారం, 2024 నాటికి ప్రపంచంలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 1.4 బిలియన్ మందికి అధిక రక్తపోటు ఉంది. అలాగే 2022లో 830 మిలియన్ మంది మధుమేహంతో జీవిస్తున్నారని తెలిపింది.
పరిశోధన ఏమి చెబుతోంది?
అమెరికాలోని Northwestern University పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్రకు కనీసం మూడు గంటల ముందు తినడం మానేయడం శరీర ఆరోగ్యానికి మంచిదని తేలింది. ఈ పరిశోధన ఫలితాలు Arteriosclerosis, Thrombosis, and Vascular Biology జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. మన శరీరం సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అనే అంతర్గత గడియారాన్ని అనుసరిస్తుంది. ఇది నిద్ర, జీవక్రియ, హార్మోన్ విడుదల, గుండె పనితీరు వంటి అనేక శరీర ప్రక్రియలను నియంత్రిస్తుంది. అయితే రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఈ సహజ లయకు అంతరాయం కలిగి, రక్తపోటు పెరగడం మరియు రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలు రావచ్చు.
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
అధ్యయనం ఎలా నిర్వహించారు?
ఈ అధ్యయనంలో 36 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 39 మంది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు 13 నుంచి 16 గంటల వరకు ఉపవాసం పాటించింది.. మరో గ్రూపు 11 నుంచి 13 గంటల ఉపవాసం పాటించింది.. ఇద్దరూ పడుకునే సమయానికి మూడు గంటల ముందు తినడం ఆపడం మరియు రాత్రి సమయంలో లైట్లు మసకబార్చడం వంటి అలవాట్లను పాటించారు.
అధ్యయనం ఫలితాలు
పరిశోధనలో కొన్ని ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి. రాత్రిపూట రక్తపోటు సుమారు 3.5 శాతం తగ్గింది.. హార్ట్‌బీట్ రేటు సుమారు 5 శాతం తగ్గింది.. రక్తంలో షుగర్ నియంత్రణ మెరుగుపడింది.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది.. ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించి, భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.
అమలు చేయడానికి సులభమైన మార్గాలు
1. భోజనం సమయాన్ని ముందుగానే నిర్ణయించండి.. మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటే, రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించడానికి ప్రయత్నించండి.
2. తేలికపాటి భోజనం చేయండి.. ప్రోటీన్, కూరగాయలు, పప్పు, పన్నీర్ లేదా సలాడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి.
3. నిద్రకు ముందు విశ్రాంతి అలవాటు చేసుకోండి.. లైట్లు తగ్గించడం, మొబైల్ లేదా స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించడం మంచిది. అవసరమైతే హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు తాగవచ్చు.
అధ్యయన పరిమితులు
ఈ పరిశోధనలో కేవలం 39 మంది మాత్రమే పాల్గొన్నారు మరియు ఇది సుమారు 7.5 వారాలపాటు మాత్రమే జరిగింది. అందువల్ల మరింత పెద్ద స్థాయిలో పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఈ విధానం షిఫ్ట్ ఉద్యోగులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అందరికీ సరిపోకపోవచ్చు. అయితే నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వంటి చిన్న మార్పులు కూడా గుండె ఆరోగ్యం, జీవక్రియ మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!