T20 World Cup 2026: టీమిండియా ఆటతీరుకు ఫిదా.. మెన్ ఇన్ బ్లూకు ఫ్యాన్‌గా మారిపోయిన పాక్ మాజీ కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో కప్ కొట్టిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా భారత క్రికెట్ జట్టు ఆటతీరును కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ICC T20 World Cup 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 256 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో కివీస్ తరచుగా వికెట్లు కోల్పోయి భారీ ఓటమిని చవిచూసింది.
భారత్ విజయం అనంతరం పలువురు ప్రస్తుత, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు టీమిండియా ప్రదర్శనను ప్రశంసించారు. ఈ సందర్భంగా అఫ్రిది మాట్లాడుతూ, టోర్నమెంట్ అంతటా భారత్ ఛాంపియన్లలా ఆడిందని పేర్కొన్నారు. జట్టు కలయిక బలంగా ఉండటంతో పాటు బెంచ్ బలం కూడా అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ బౌలర్ బుమ్రాను అఫ్రిది ప్రత్యేకంగా ప్రశంసించాడు. కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా, యార్కర్లు, స్లో బాల్స్‌తోనైనా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడని అభినందించారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అలాగే టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన చేసిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌ను కూడా అఫ్రిది ప్రశంసించాడు. ముఖ్యంగా శాంసన్ ఓపెనర్‌గా పంపిన నిర్ణయం గొప్ప వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మొత్తం మీద టోర్నమెంట్ అంతటా భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, టైటిల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని అఫ్రిది అభినందించారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది..
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?