G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!
- జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు!
- చమురుపై కీలక చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగేటట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షోభంపై చర్చించేందుకు జీ 7 దేశాలు అత్యవసర సమావేశం అవుతున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ మీటింగ్ ద్వారా చమురు నిల్వల విడుదలపై చర్చించనున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతే కాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు నిల్వలు పడిపోతున్నాయి. దీంతో సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జీ 7 దేశాలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- Israel Politics: మిడిలీస్ట్‌ను వణికించిన దేశానికి బాస్ ఎవరు? ఇజ్రాయెల్ పీఠంపై వీడని సస్పెన్స్!
- North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ 'సైబర్ సైన్యం'.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
- Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
- Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు అయిన భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల తాత్కాలికమని పేర్కొన్నారు. ఇరాన్ అణు ముప్పును నిర్మూలించే ప్రయత్నాలు పూర్తయిన తర్వాత ధరలు తగ్గుతాయని అన్నారు.
అయితే గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో మార్కెట్‌ను స్థిరపరచడానికి జీ7 దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించి చమురు నిల్వలను విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించనున్నాయి.
ఇది కూడా చదవండి: Vijay: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. హీరో విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసు
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!