Domestic Flour Mill: తక్కువ టైంలో హెల్దీ చపాతీలు.. గోధుమలు రుబ్బే హోమ్ మిషన్స్ ధర ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic Flour Mill: ఈ రోజుల్లో నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా చాలామంది ప్యాక్ చేసిన గోధుమ పిండిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ప్యాకెట్ పిండి ఎంతవరకు శుభ్రమైనది? ఎంత నాణ్యమైనది? అన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల డొమెస్టిక్ ఫ్లోర్ మిల్లులు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీటిని నేరుగా మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. వాటి ధర ఎంత, వాటి ఫీచర్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gen Z Reality : 23 ఏళ్లకే పచ్చి తాగుబోతులుగా మారుతున్న యువత..!
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
డొమెస్టిక్ ఫ్లోర్ మిల్లులతో లాభాలు..
* మన కళ్లముందే గోధుమలను శుభ్రం చేసి పిండిగా మార్చుకోవచ్చు.
* ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన పిండి లభిస్తుంది.
* కేవలం గోధుమలే కాదు, ఇతర తృణధాన్యాలను కూడా కలిపి మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేసుకోవచ్చు.
* ఈ ఆధునిక యంత్రాలను శుభ్రం చేయడం కూడా చాలా సులభం.
మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇవే:
1. కాంపాక్ట్ మిక్సర్ సైజు మిల్లు (రసోయిషాప్)
మీరు ఇప్పుడే డొమెస్టిక్ ఫ్లోర్ మిల్లులు ప్రారంభిస్తుంటే, చిన్న సైజు పరికరాలు బెస్ట్. ఇవి చూడటానికి మన ఇంట్లోని మిక్సర్ గ్రైండర్ పరిమాణంలోనే ఉంటాయి. రసోయిషాప్ (RasoiShop) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఈ మిషన్ ధర సుమారు రూ.18 వేల వరకు ఉంటుంది.
2. ఆటోమేటిక్ మినీ-రిఫ్రిజిరేటర్ మిల్లు
అమెజాన్ ఇండియాలో మినీ-రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉండే ఆటోమేటిక్ అట్టా చక్కీలు లభిస్తున్నాయి. వీటి ధర సుమారు రూ.18,900. ఇందులో గోధుమలతో పాటు మల్టీగ్రెయిన్ పిండిని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
3. నటరాజ్ (Natraj) పిండి మిల్లు
ప్రముఖ బ్రాండ్ ‘నటరాజ్’ నుంచి వస్తున్న ఈ ఆటోమేటిక్ పిండి మిల్లులో 1HP మోటారు ఉంటుంది. ఇది కేవలం గోధుమలనే కాదు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కూడా గ్రైండ్ చేయగలదు. దీనిని క్లీన్ చేయడం కూడా చాలా సులభం.
4. మిలన్ (Milann) పిండి మిల్లు
అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న మిలన్ బ్రాండ్ పిండి మిల్లుకు BEE 5-స్టార్ రేటింగ్ ఉంది. అంటే ఇది విద్యుత్ ఆదా చేస్తుంది. దీని ధర సుమారు రూ.17,999. ఈ మిషన్ గంటకు 8 నుంచి 10 కిలోల గోధుమలను పిండిగా మార్చగలదు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కల్తీ లేని ఆహారం తీసుకోవడం ముఖ్యం. ప్యాకెట్ పిండి కంటే ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఎంతో మేలు. పైన పేర్కొన్న మిషన్లలో మీ బడ్జెట్, అవసరానికి తగ్గట్టుగా ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!