Aqua Sector: ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం
- యుద్ధ ప్రభావంతో పడిపోయిన రొయ్యల ధరలు
- ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు భారీ నష్టం
- పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన మార్కెట్ ధరలు
- ప్రభుత్వ జోక్యం కోరుతున్న ఆక్వా సాగుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగాన్ని, ముఖ్యంగా రొయ్యల సాగుదారులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. గత ఏడాది అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు, ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో భారీ దెబ్బగా మారాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయి రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
గత నాలుగైదు రోజులుగా రొయ్యల ధరలు కేజీకి ₹30 నుండి ₹40 వరకు పతనమవ్వడంతో, ఒక్కో టన్ను పట్టుబడిపై రైతుకు సుమారు ₹40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర ₹510 నుండి ₹470కి, 40 కౌంట్ ధర ₹410 నుండి ₹360కి పడిపోవడం సాగుదారులను కోలుకోలేని దెబ్బ తీసింది.
మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. మేత (Feed) ధరలు, విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
Prize Money: ఫైనల్‌లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?
దీనికి తోడు మార్కెట్లో ఏ చిన్న అనిశ్చితి ఏర్పడినా ప్రాసెసింగ్ యూనిట్లు , ఏజెంట్లు ‘సిండికేట్’గా ఏర్పడి ధరలను కావాలనే తగ్గిస్తున్నారని, యుద్ధం నెపంతో ట్రేడర్లు తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సీడ్ (Seed) లభించకపోవడం, వైరస్ వ్యాధుల ముప్పు కూడా తోడవ్వడంతో ఆక్వా రంగం అస్తవ్యస్తంగా మారింది.
నిజానికి కరోనా కాలం నుండి ఆక్వా రంగం వరుస విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. మొదట రవాణా ఆటంకాలు, ఆపై అమెరికా ఆంక్షలు, ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా రైతులను దెబ్బతీశాయి. ఇప్పుడు తాజాగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎగుమతి నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని ఆక్వా సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అప్పుల బాధ తాళలేక వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!