పద్దెనిమిది ఏళ్ల లోపు వయసున్న పిల్లల ఫొటోలు, వివరాలు, వీడియోలు పేపర్లలో, టీవీల్లో ప్రసారం చేయొద్దు

స్వయంగా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అది వారి గోప్యతను భంగపరుస్తుందని పేర్కొంది.

సుప్రీం కోర్టు అంతలా చెబుతుంటే.. మీరేం చేస్తున్నారు..?

మీ సొంత పిల్లల మీరు మీ పిల్లల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు వాళ్ల అనుమతి తీసుకుంటున్నారా..?

వాళ్లకేం తెలుసు చిన్నపిల్లలు అనుకుంటున్నారా..? అయితే అదే భవిష్యత్తులో ప్రమాదకరం కావొచ్చు.

వాళ్ల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీదే ఉంటుంది.

ఇలా చెప్పడం.. కొంత హర్ట్ చేసే విషయమే అయినా.. ఓసారి ఆలోచించండి.

56% పేరెంట్స్ తమ పిల్లల ఫొటోలను పోస్ట్ చేయడానికి ఇష్టపడటం లేదని ఆఫ్రికామ్ అనే సర్వేలో తేలింది.

తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తమ బాధ్యత అని వారు చెప్పారట.

క్రికెట్ విరాట్ కోహ్లి-అనుష్క జంట తమ చిన్నారిని ఫొటోను రివీల్ చేయకపోవడానికి ఇదే కారణం.

కోహ్లి-అనుష్క జంట బాటలోనే నాయనతార -విఘ్నేష్‌ జంట ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు రివీల్‌ చేయలేదు