T20 World Cup match: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. గేమ్‌ఛేంజర్‌గా శ్రీలంక..
- భారత్-పాక్ మ్యాచ్‌కు మార్గం సుగమం..
- కొలంబో వేదికగా ఈ నెల 15న మ్యాచ్..
- గేమ్‌ఛేంజర్‌గా వ్యవహరించిన శ్రీలంక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup match: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ముగిశాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈనెల 15న కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. బంగ్లాదేశ్ భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడం, బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తీసేసి, ఆ స్థానంలో స్కాట్లాండ్ ను తీసుకోవడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిరసన వ్యక్తం చేసింది. దీంతో పాటు భారత్‌తో మ్యాచ్ ను బహిష్కరించింది.
అయితే, ఎట్టకేటకు చర్చోపచర్చల తర్వాత పాక్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఐసీసీ ఆంక్షలు, ఆర్థిక నష్టం భయాలు పాక్ యూ-టర్న్‌కు ఒక కారణం కాగా, మొత్తం వివాదంలో గేమ్ ఛేంజర్‌గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్‌పై శ్రీలంక భారీ ఆశలు పెట్టుకుంది. ఒక వేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఆ దేశం ఆర్థికం నష్టపోయేది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. ఇటు భారత్, అటు పాక్ నుంచి భారీగా ప్రేక్షకులు తరలివస్తారు. శ్రీలంక ఆతిథ్య రంగం భారీగా క్యాష్ చేసుకుంటుంది.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
Read Also: Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..
ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగేలా శ్రీలంక చర్చలు నిర్వహించింది. సోమవారం రాత్రి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయక, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. ఈ మ్యాచ్ జరిగేలా శ్రీలంక కృషి చేసింది. శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 8) కొలంబో, ఇస్లామాబాద్‌లోని రెండు హైకమిషన్ల ద్వారా పాకిస్తాన్ అధికారులను సంప్రదించింది. ఇరు దేశాల దేశాధినేతల మద్య సుమారు 30 నిమిషాలు ఫోన్ సంభాషణ జరిగినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ మంగళవారం ఉదయం తెలిపారు. ఇది క్రికెట్ దౌత్యం అని అన్నారు.
శ్రీలంక మాత్రమే కాకుండా బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీసీ) యూఏఈ క్రికెట్ బోర్డులు కూడా మ్యాచ్ ఆడేలా పాక్‌పై ఒత్తిడి తెచ్చాయి. దీంతో సోమవారం భారత్‌తో మ్యాచ్ ఆడుతామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే మ్యాచ్ జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..