Peddi Overseas Rights : పెద్ది ఓవర్సీస్ రైట్స్.. చరణ్ కెరీర్లోనే రికార్డ్ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. పై ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ చర్చ గట్టిగా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 మిలియన్ డాలర్స్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. దీంతో.. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక నార్త్ అమెరికా డీల్‌గా ఇది నిలవనుంది. నార్త్ అమెరికాలో ‘RRR’ చిత్రం సుమారు 15 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
Also Read : Directors Clarity : తప్పుడు కథనాలు రాస్తే.. లీగల్ యాక్షన్ తీసుకుంటాం
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
కానీ, రామ్ చరణ్ నుంచి ఇటీవల వచ్చిన సోలో సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రం 2 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. అయినప్పటికీ, ‘పెద్ది’ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. మొత్తంగా.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 9.5 మిలియన్స్ డాలర్స్‌కు అమ్ముడుపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ, విడుదలకు చాలా సమయం ఉండగానే.. బిజినెస్ పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది పెద్ది. ఈ చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తుండగా, ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా..పెద్ది నార్త్ అమెరికా డీల్ రామ్ చరణ్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!