Mohammad Deepak: అయ్యో పాపం “మహ్మద్ దీపక్”..
- ‘‘మహ్మద్ దీపక్’’పై వ్యతిరేకత..
- ఇటీవల ముస్లిం వ్యాపారిని రక్షించి ‘‘వైరల్’’..
- దీపక్ జిమ్‌లో వివాదానికి 150 మంది, ఇప్పుడు 15 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Deepak: ఉత్తరాఖండ్ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన దీపక్ కుమార్ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు అతడి పేరు అడిగితే ‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పుకోవడంతో ఒక్కసారి హీరో అయ్యారు. జనవరి 26న స్థానికంగా ఉన్న 70 ఏళ్ల ముస్లిం షాపు యజమానికి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సిద్ధ్‌బాలి బాబా ఆలయాన్ని పోలి ఉందని చెప్పారు.
Read Also: Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్‌లో నిందితుల అరెస్ట్!
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
అయితే, అహ్మద్ ను మతపరంగా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వివాద సమయంలో దీపక్ ఆ వృద్ధుడిని కాపాడాడు. ‘‘నా పేరు మహ్మద్ దీపక్’’ అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్ కుమార్ జిమ్‌కు వెళ్లి సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఏకంగా మెంబర్ షిప్ తీసుకున్నారు. దీపక్ ‘‘ఇండియా హీరో’’ అంటూ రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఇదే విధంగా రాహుల్ గాంధీ తాను సెల్యూట్ చేస్తానని దీపక్ అన్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు దీపక్ వ్యాపారంపైనే పెద్ద దెబ్బ పడింది. ఈ వివాదానికి ముందు దీపక్ జిమ్‌లో 150 సభ్యులు ఉంటే, ఇప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు. స్థానికులు జిమ్‌ను బహిష్కరించారు. జిమ్ రెంట్ రూ. 40,000, హోమ్ లోన్ ఈఎంఐ రూ. 16,000 ఇబ్బందికరంగా మారింది. ఆదాయం దాదాపుగా తగ్గిపోయింది. ఇంటి ఖర్చుల నిర్వహించడానికి తన తల్లి టీ స్టాల్‌పై ఆధారపడిందని చెబుతున్నాడు. మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దీపక్‌కు మద్దతు ఇచ్చిన వారిని తప్పుపట్టారు. పవిత్రమైన హిందూ పేరుకు ముందు మహ్మద్ పేరు పెట్టుకోవడంపై విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నా, స్థానికంగా మాత్రం వ్యతిరేక వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!