Monalisa: తన ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్‌తో స్కూల్ పెడుతోన్న మోనాలిసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో దండలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా.. ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. సాధారణ జీవితంతో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు వెండితెర వరకు చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహాకుంభ్‌లో వైరల్ అయిన తర్వాత వచ్చిన అవకాశాలతో మోనాలిసా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల తన మొదటి హిందీ సినిమా “ది డైరీ ఆఫ్ మణిపూర్” ప్రారంభోత్సవానికి హాజరైన మోనాలిసా భావోద్వేగానికి గురైంది. సినీ ప్రపంచం, తన పాత జీవితం రెండింటినీ సమానంగా ప్రేమిస్తున్నానని ఆమె వెల్లడించింది.
ఇక, తాజాగా ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి వచ్చిన మోనాలిసా, గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపింది. మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని ఆమె చెప్పింది. తన జీవితాన్ని మార్చిన ఈ అవకాశాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మోనాలిసా వెల్లడించింది. తన ఫస్ట్ మూవీ నుంచి వచ్చే రెమ్యునరేషన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలన్నదే తన కల అని ఆమె తెలిపింది. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవని, చదువుకోని బాలికలు జీవితంలో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని మోనాలిసా నమ్మకం. అందుకే తన సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా, భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు మోనాలిసా.. కాగా, ప్రస్తుతం మోనాలిసా మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా, ఒకటి హిందీ సినిమా “ది డైరీ ఆఫ్ మణిపూర్”. సాధారణ అమ్మాయి నుంచి సినీ నటి వరకు వచ్చిన ఆమె ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తిగా మారింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. తాను ఎక్కడ నుంచి వచ్చాను అనే విషయాన్ని మర్చిపోకుండా.. ఆ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని చూస్తుంది..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!