Smriti Mandhana Net Worth: స్మృతి సూపర్.. ఆటలో విజయం, సంపాదనలో సూపర్ స్టార్!
- గ్లోబల్ ఐకాన్‌గా స్మృతి మందాన
- బ్యాటింగ్‌తో పాటు కమర్షియల్‌గా కూడా సక్సెస్
- ఆటలో విజయం, సంపాదనలో సూపర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana Net Worth 2026: భారత మహిళా క్రికెట్‌కు గ్లోబల్ ఐకాన్‌గా మారిన స్మృతి మందాన.. గత రెండు సీజన్లుగా అసాధారణ విజయాలను అందుకుంటున్నారు. ప్రపంచ స్థాయి బ్యాటింగ్ ప్రదర్శనలతో పాటు కమర్షియల్‌గా కూడా భారీ ఎదుగుదల సాధించారు. 2025లో జరిగిన మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు చారిత్రాత్మక తొలి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి.. టోర్నమెంట్ టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలిచారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన స్మృతి మందాన.. ఫ్రాంచైజ్ క్రికెట్‌లోనూ ప్రభావం కొనసాచారు. 2026 ఫిబ్రవరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ముందుండి నడిపిస్తూ.. రెండో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆమెకు ‘బిగ్ మ్యాచ్ ప్లేయర్’గా మరింత గుర్తింపు తీసుకొచ్చింది.మొత్తంగా స్మృతి మహిళా క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరిగా మారారు. 2026 నాటికి ఆమె నెట్ వర్త్ సుమారు రూ.34 కోట్లు నుంచి రూ.40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు, లీగ్ క్రికెట్ ఆదాయం, అలాగే హై-వాల్యూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు స్మృతి మందాన సంపాదనకు ప్రధాన కారణాలు. బీసీసీఐ గ్రేడ్ ‘A’ సెంట్రల్ కాంట్రాక్ట్ కింద స్మృతికి ఏటా రూ.50 లక్షలు దక్కుతున్నాయి. అదనంగా మ్యాచ్ ఫీజుల రూపంలో టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు సంపాదిస్తారు. బీసీసీఐ నుంచే స్మృతి ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా స్మృతి అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్లలో ఒకరు. ప్రతి సీజన్‌కు సుమారు రూ.3.4 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది.
క్రీడారంగం మాత్రమే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ స్మృతి మందాన హవా కొనసాగుతోంది. స్పోర్ట్స్‌వేర్, బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్, న్యూట్రిషన్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. స్మృతి విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నారు. ఆమె ఇప్పుడు సౌకర్యవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారు. అంతటి విజయాలు, సంపాదన ఉన్నప్పటికీ.. ఆమె తన సహజ వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నారు .మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ప్రేక్షకాదరణ, డబ్ల్యుపీఎల్ విస్తరణ, స్మృతి వ్యక్తిగత బ్రాండ్ విలువను పరిగణనలోకి తీసుకుంటే.. 2026 తర్వాత కూడా ఆమె నెట్ వర్త్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!