BC Reservations : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు.. రాష్ట్రపతి పరిశీలనలో రెండు కీలక బిల్లులు.!
- బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
- రెండు కీలక బిల్లులు కేంద్రానికి పంపిన తెలంగాణ అసెంబ్లీ
- రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో పరిశీలన
- కేంద్ర నిర్ణయంపైనే బీసీ వర్గాల రాజకీయ, ఉపాధి భవిష్యత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BC reservations : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రెండు బిల్లులు కేంద్రానికి అందాయని స్పష్టం చేశారు. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రం వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు.
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
Also Read
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
రిజర్వేషన్ల శాతం పెంచడం అనేది రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రపతి భవన్‌కు పంపడం జరిగింది. తెలంగాణలోని బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే క్రమంలో 42 శాతం కోటాను అమలు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లులు పరిశీలన దశలో ఉన్నాయని, తదుపరి చర్యలు రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటాయని మంత్రి వెల్లడించారు. ఈటల రాజేందర్ వేసిన ఈ ప్రశ్నతో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియపై రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధతకు కొంత వరకు తెరపడినట్లయింది. కేంద్రం తీసుకునే తదుపరి నిర్ణయంపైనే తెలంగాణలోని బీసీ సామాజిక వర్గాల రాజకీయ , ఉపాధి భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.!
తాజావార్తలు
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!