తేనెతో కాస్త వ్యాస్లిన్ కలిపిన మిశ్రమాన్ని రోజువారీగా రాసుకుంటే పెదవులు గులాబీల్లా మెరుస్తాయి.

రోజూ రాత్రి పడుకునే ముందు తేనెతో పెదవులపై మర్దన చేస్తే పెదవులు తేమను కోల్పోకుండా ఉంటాయి.

చలికాలం ఎక్కువగా దాహం వేయదు. కానీ ఎప్పటిలాగే శరీరానికి కావాల్సినంత నీటిని తప్పకుండా తాగాలి.

దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు ఓ గ్లాసు నీరు తాగడం మంచిది.

 చలికాలంలో పెదాలకు అలోవెరా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్‌ను రాసినా మంచి ఫలితం ఉంటుంది.

రోజూ రాత్రి పడుకునే ముందు అలోవెరా ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను పెదాలకు రాసి పడుకోవాలి. ఉదయం వరకు పెదాలకు కావాల్సిన తేమ అందుతుంది.

మిల్క్ క్రీమ్స్ వాడితే పెదవుల పగుళ్లను నివారించవచ్చు. నెయ్యిని రోజూ రాత్రి పడుకునే ముందు పెదవులకు రాయాలి.

కొబ్బరి నూనెను కూడా స్నానానికి ముందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను చలికాలం మొత్తం పాటించవచ్చు.

లిప్‌బామ్‌ను పెదాలకు రాసి కొంతసేపయ్యాక టూత్‌బ్రష్‌తో పెదాలపై సున్నితంగా బ్రష్ చేయాలి.

అనంతరం ఒక శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి పెదాలను తుడవాలి. మళ్లీ కొంత సమయానికి మళ్లీ ఇలాగే చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా మారుతాయి.

 కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని వాటి నుంచి జ్యూస్ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.

రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకొని అందులో కాటన్ బాల్స్ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దన చేయాలి.