1/4 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ కలబంద జెల్, 1 స్పూన్ తేనెతో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖాన్ని అప్లై చేసుకొని, కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తే.. ముఖంపై నల్లటి వలయాలను తొలగిపోతాయి

1/2 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల శెనగ పిండి, 1/2 స్పూన్ నిమ్మరసం, కొద్ది పాలు వేసి కలుపుకోవాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి, బాగా ఆరాక గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే.. మొటిమలు మాయం అవుతాయి

ఒక స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ కొబ్బరి పాలు, 2 స్పూన్ల శెనగపిండి వేసి.. బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, నీళ్లతో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ టోన్ పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది

2 స్పూన్ల తేనెలో 1/4 స్పూన్ పసుపు పొడి, 5 చుక్కల నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం ముఖానికి రాసుకున్నాక, 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ మాస్క్ చర్మాన్ని తెల్లగా చేయడంతో పాటు మొటిమలను నయం చేస్తుంది

ఒక గిన్నెలో 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ పాలు కలిపి.. ముఖానికి అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తే.. ముఖం బాగా మెరిసిపోతుంది 

1/4 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల దోసకాయ రసం కలిపి.. ముఖానికి పట్టించాలి. సున్నితంగా మసాజ్ చేసి.. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు పోతాయి