IND vs USA: యూఎస్‌ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs USA: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకానొక దశలో స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న భారత్‌ను తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసేలా ముందు ఉండి నడిపించాడు. యూఎస్‌ఏ విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాల్సి ఉంది.
READ ALSO: OFF THE RECORD: మున్సిపల్ ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నిరాశపరిచిన టాప్ ఆర్డర్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. షాడ్లీ వేసిన ఆరో ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లో ఇషాన్, తిలక్ వర్మలతో పాటు శివమ్ దూబే (0) కూడా వెనుదిరగడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
సూర్య ‘స్కై’ లెవల్ బ్యాటింగ్
వికెట్లు పడుతున్నా ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ మొండిగా నిలబడ్డాడు. హార్దిక్ పాండ్యా (5), రింకూ సింగ్ (6) స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్ (14) తో కలిసి సూర్య ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 36 బంతుల్లోనే తన కెరీర్‌లో 25వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది స్కోరును 161కు చేర్చాడు. సూర్య 84 (నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
యూఎస్‌ఏ బౌలర్లు భారత బ్యాటర్లపై పక్కా హోంవర్క్ చేసినట్లు కనిపించింది. ముఖ్యంగా షాడ్లీ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు. అయితే సూర్య తన అనుభవంతో అమెరికా వ్యూహాలను చిత్తు చేశాడు. ఆఖరిలో అర్ష్‌దీప్ (4) అవుట్ కాగా, వరుణ్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
స్కోరు వివరాలు:
భారత్: 161/9 (20 ఓవర్లు)
యూఎస్‌ఏ లక్ష్యం: 162 పరుగులు.
READ ALSO: India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!