Sunil Thapa: ప్రియాంక చోప్రా కోచ్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Thapa: నటుడు సునీల్ థాపా 68 సంవత్సరాల వయసులో శనివారం ఖాట్మండులో గుండెపోటుతో మరణించారు. ఆయన నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. మేరీ కోమ్ సినిమాలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కోచ్‌గా నటించారు. ఈ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చిన పాత్రలలో ఒకటిగా నిలిచింది.
Also Read
- Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
- Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
- Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
- Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
ఆయన తన సినీ జీవితాన్ని బాలీవుడ్ చిత్రం ఏక్ దుజే కే లియేతో ప్రారంభించారు. అలాగే ఆయన నేపాలీ సినిమాల్లో చాలా పెద్ద సెలబ్రిటీ, నాలుగు దశాబ్దాలకు పైగా నేపాలీ సినిమా పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన థాపా 300 కి పైగా నేపాలీ చిత్రాలలో నటించారు. నేపాలీ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ చినో (1991) లో రటే కైలా పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టింది. 2014 లో ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్ చిత్రంలో ఆయన ప్రియాంక చోప్రా కోచ్ నర్జిత్ సింగ్ పాత్ర పోషించారు. ఈ పాత్ర థాపాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.
నటనలోకి రాకముందు థాపా 1970ల మధ్యలో ముంబైలో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత ఆయన సినిమాల్లోకి వచ్చి, హిందీ, ప్రాంతీయ సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు ఎన్నో పోషించారు. ఆయన ఇటీవల రిలీజ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో డేవిడ్ ఖుజౌ పాత్రలో కనిపించి అలరించారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన నాగాలాండ్‌లో గౌరవనీయమైన నాయకుడు, MCA చీఫ్ పాత్రను పోషించారు. తన సినీ కెరీర్ మొత్తంలో థాపా అనేక ప్రశంసలను అందుకున్నారు. వాటిలో రెండుసార్లు మోషన్ పిక్చర్స్ అవార్డు నేపాల్ కూడా ఉంది. ఆయన ఎవరెస్ట్ ఫిల్మ్ అకాడమీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
READ ALSO: Mumaith Khan: చావు అంచు దాకా వెళ్లి వచ్చాను! ఆ ప్రమాదం వల్ల నా జీవితం తలకిందులైంది: ముమైత్ ఖాన్
తాజావార్తలు
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!