Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 07 02 2026

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 7, 2026 , 5:14 pm
By Gogikar Sai Krishna
  • ట్రంప్‌పై విమర్శలు.. ఒబామా దంపతుల కోతి బొమ్మల వీడియో తొలగింపు
  • పిల్లల కష్టాలు చూసి చలించిన పవన్.. గ్రామానికి రోడ్డు మంజూరు!
  • దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దు!
  • ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదం అందువల్లే జరిగింది.. DFO కీలక వ్యాఖ్యలు
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతలు.. సిద్ధిపేటలో హైటెన్షన్!

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన BRS పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి తీవ్ర నష్టం జరిగిందని దానికి కారణం BRS పార్టీయేనని ఆరోపణలు చేశారు. ఇక, మాజీ మంత్రి హరీష్ రావు మా కాలనీల్లో ప్రచారానికి రావొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా BRS పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే, మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో BRS, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరికి మరొకరు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

ట్రంప్‌పై విమర్శలు.. ఒబామా దంపతుల కోతి బొమ్మల వీడియో తొలగింపు

మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. డెమోక్రాట్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. జాత్యహంకార దాడిగా అభివర్ణించారు. తొలుత విమర్శలను వైట్‌హౌస్ ఖండించినా.. కొద్దిసేపటి తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విమర్శులు తీవ్ర రూపం దాల్చడంతో ట్రంప్ సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించారు. సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించినట్లుగా వైట్‌హౌస్ ప్రకటించింది. సెనేట్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో వీడియో తొలగించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 12 గంటల తర్వాత వీడియోను డిలీట్ చేశారు.

60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?

సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ దగ్గర గంజి మైదాన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తున్నారు.. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి.. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి బియ్యం తక్కువ ఉన్నా తినే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.

గర్ల్‌ ఫ్రెండ్‌తో పేరెంట్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకొంటారు.. విదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ యువత ఈ సంస్కృతికి ఆకర్శితులవుతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలు, ఆఫీస్ పనుల పరుతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు. ఫిబ్రవరి 14వ తేదీని వారం రోజుల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఫిబ్రవరి 7న రోజ్‌డేతో మొదలై 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవర్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడుతుంటారు. రెస్టారెంట్లు, సినిమా హాల్లు, పబ్బుల్లో జంటలు దర్శనమిస్తుంటాయి. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి వారి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ పేరెంట్స్‌కి వీళ్ల విషయం తెలిస్తే.. తల్లికి కుమారుడు తన లవర్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే? ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.

శ్రీశైలంలో రేపటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా, భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో రేపు ఉదయం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఎల్లుండి నుండి శ్రీస్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలు మరియు గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.. ఇక, జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు అది కూడా నిర్ణిత వేళల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.. శివ స్వాములు, భక్తుల రద్దీ దృష్ట్యా.. 40 లక్షల లడ్డూలు అందుబాటు ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు..

పాక్‌లో మసీద్‌పై దాడిని నిరసిస్తూ శ్రీనగర్‌లో నిరసనలు.. భారీ ర్యాలీలు

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం బాంబ్ దాడులతో దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 170 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్‌ను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని నిరసిస్తూ శనివారం భారత్‌లో నిరసనలు వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని హంజీవేరా ప్రాంతంలో షియా వర్గానికి చెందిన కొందరు నిరసనలు వ్యక్తం చేశారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. మహిళలు, పురుషులు ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపైకి వచ్చి షియా స్థానికులు నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు‌..

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా‌..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.

దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దు!

మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కమిటీలు, దర్యాప్తుల వ్యవహారంలో స్పష్టత లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిజంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం ఉంటే డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పాత పార్టీ అధ్యక్షురాలు లేదా చంద్రబాబు కుమారుడితో కమిటీ ఏర్పాటు చేసి ఫైండింగ్స్ ఇవ్వమని చెప్పాలని చురకలనంటించారు. ఏకసభ్య కమిషన్‌లు ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. శ్యామలరావును ప్రక్షాళన కోసం నియమించారని.. NDDB, NDRI ల్యాబ్ నివేదికలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ తరువాత అదే అంశంపై కోర్టుకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదం అందువల్లే జరిగింది.. DFO కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) కార్యాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నేర పరిశోధనలో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను భద్రపరిచే చోట మంటలు చెలరేగడంతో, పలు కేసుల్లో సేకరించిన భౌతిక ఆధారాలు (Physical Evidence) పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంపై డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విస్తుపోయే వివరాలను వెల్లడించారు. మంటలు వ్యాపించిన తీరు, జరిగిన ఆస్తి నష్టం, కేసులపై పడే ప్రభావం గురించి ఆయన వివరించారు.

పిల్లల కష్టాలు చూసి చలించిన పవన్.. గ్రామానికి రోడ్డు మంజూరు!

పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన పవన్ కళ్యాణ్, అంచనాలు రూపొందించి తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షల అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ జారీ అయ్యింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి నుంచి నిత్యం స్కూలులకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతుల కష్టాలు తీరనున్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • botsa satyanarayana
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • Forensic Lab Fire
  • telugu news

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions