India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-యూఎస్‌ఏ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్‌ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్‌లో రెండవ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన అలీ ఖాన్, వచ్చి రాగానే తన మొదటి బంతికే అభిషేక్‌ను అవుట్ చేశాడు. దీనితో వాంఖడే స్టేడియంలో గుమిగూడిన వేలాది మంది అభిమానులు ఆశ్చర్యపోయారు.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
అభిషేక్‌ను అవుట్ చేసిన విధానం చూస్తే.. ప్రత్యర్థి బౌలర్లు చాలా హోంవర్క్ చేసినట్లు కనిపిస్తుంది. అమెరికా జట్టు కోచింగ్ సిబ్బంది ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌ను చాలా దగ్గరగా అధ్యయనం చేయడం ద్వారా తనను ఔట్ చేసినట్లు అర్థం అవుతుంది. అభిషేక్ శర్మ అంటేనే పాయింట్, కవర్స్ మీదుగా బంతిని చీల్చుకుంటూ వెళ్లే ‘స్లాష్’ షాట్లకు పెట్టింది పేరు. ఆ బలమే ఇప్పుడు అతడి పాలిట శాపమైంది. సాధారణంగా అభిషేక్ కోసం ప్రత్యర్థి జట్లు డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌ను పెడతాయి. కానీ అమెరికా మాత్రం ఇందుకు భిన్నంగా అతడిని ఊరించేలా ‘డీప్ కవర్’ను సిద్ధం చేసింది. తను ఆశించినట్లుగానే బంతి కాస్త వెలుపలగా రావడంతో అభిషేక్ తన బ్యాట్ ఝుళిపించాడు. అయితే అమెరికా వ్యూహం పక్కాగా ఫలించింది. ఆ షాట్ నేరుగా డీప్ కవర్‌లో ఉన్న సంజయ్ కృష్ణమూర్తి చేతుల్లోకి వెళ్లింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అభిషేక్ ‘గోల్డెన్ డక్’గా వెనుదిరగడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. తన నుంచి మరొక మెరుపు ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
భారత్ నుంచి ఐదవ బ్యాట్స్‌మన్..
తన తొలి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో చిరస్మరణీయ అరంగేట్రం చేయాలనే అభిషేక్ కల చెదిరిపోయింది. టీ20 ప్రపంచ కప్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఐదవ భారత బ్యాట్స్ మాన్‌గా అభిషేక్ నిలిచాడు. కానీ ఈ ఐదుగురిలో అభిషేక్ విధి ప్రత్యేకమైనది. ఎందుకంటే అతను గోల్డెన్ డక్‌గా అవుట్ అయ్యాడు. ప్రపంచ కప్‌లో తమ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా అవుట్ అయిన ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, శార్దూల్ ఠాకూర్, దీపక్ హుడా. అయితే ఠాకూర్, నెహ్రా టెయిలెండర్లు, నిజానికి ఈ చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకుంది ముగ్గురు బ్యాట్స్ మెన్ మాత్రమే.
READ ALSO: Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
తాజావార్తలు
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?