Quantum Valley Foundation: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా “క్వాంటమ్ వ్యాలీ” శంకుస్థాపన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quantum Valley Foundation: అమరావతి రాజధానిలో అత్యాధునిక సాంకేతిక రంగానికి నాంది పలుకుతూ “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. సుమారు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో రెండు వరుసల్లో మొత్తం 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. వీటిలో 48 అంతస్తుల ఎత్తైన టవర్లు, అలాగే 29 అంతస్తుల భవనాలు నిర్మించబడనున్నాయి. మొత్తం కలిపి సుమారు 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు.
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
ఇక రెండు ఎకరాల్లో G+1 నమూనాలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మించనున్నారు. ఆ భవనం సుమారు 43 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. భారీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎల్ఎండ్టీ (L&T) సంస్థ చేపట్టనుంది. క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో ప్రముఖ సంస్థ ఐబీఎం (IBM) భాగస్వామ్యం కానుండగా.. వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ (TCS) అందించనుంది. అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. అలాగే డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఐటీ, అధునాతన సాంకేతిక రంగాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!