T20 World Cup 2026: ప్రపంచ కప్‌లో నవ్వుల పాలు కాకుండా బయటపడ్డ పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఈ ఏడాది జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ నవ్వుల పాలు కాకుండా ఫస్ట్ మ్యాచ్‌లో విజయంతో బయటపడింది. నిజానికి పాకిస్థాన్ ఐసీసీ టోర్నమెంట్ స్టార్టింగ్ డే రోజున సూపర్‌గా రాణించడం అనేది చాలా అరుదు. గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. గత టీ20 ప్రపంచ కప్‌లో ఈ మాజీ ఛాంపియన్‌లను వారి స్టార్టింగ్ మ్యాచ్‌లో యుఎస్‌ఎ ఆశ్చర్యపరిచింది. అయితే ఈసారి ఫిబ్రవరి 7న (శనివారం) కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 లో పాకిస్థాన్ మంచి ఫీల్డింగ్ ప్రదర్శనతో నవ్వుల పాలు కాకుండా తప్పించుకుంది.
READ ALSO: Wine Bottle: తవ్వకాలల్లో బయటపడ్డ 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్.. టేస్ట్ చూసిన నిపుణులు.. చివరకు
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో ఓవర్‌లోనే అసలైన డ్రామా స్టార్ట్ అయ్యింది. మొహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో డచ్ ఓపెనర్ మైఖేల్ లెవిట్ భారీ షాట్ ఆడాడు. బంతి లాంగ్-ఆఫ్ బౌండరీ అవతలికి వెళ్తుందని భావిస్తున్న తరుణంలో బాబర్ అజామ్ మెరుపు వేగంతో దూసుకువెళ్లాడు. బంతిని అందుకున్న తర్వాత తన మొమెంటం బౌండరీ వెలుపలికి తీసుకెళ్తుందని గ్రహించిన బాబర్.. ఎంతో సమయస్ఫూర్తితో బంతిని గాలిలోకి విసిరాడు. అక్కడే ఉన్న షాహీన్ అఫ్రిది ఆ బంతిని అందుకోవడంతో లెవిట్ ఇన్నింగ్స్ ముగిసింది.
వివాదాలకు తావులేకుండా..
గతంలో 2025 రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇలాంటి రిలే క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో వివాదం నెలకొంది. కానీ బాబర్ అజామ్ శనివారం ప్రదర్శించిన ‘టెక్స్ట్ బుక్ పెర్ఫెక్షన్’ ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం క్లీన్‌గా సాగింది. అయితే ఇదే బాబర్ తర్వాత ఒక క్యాచ్‌ను జారవిడిచినప్పటికీ, జట్టు మొత్తం తొమ్మిది క్యాచ్‌లతో సత్తా చాటి.. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
తొలుత నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన నెదర్లాండ్స్.. పాక్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. చివరి ఏడు వికెట్లను కేవలం 42 పరుగుల వ్యవధిలోనే కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లతో చెలరేగగా.. నవాజ్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్యాచింగ్ పట్టు తప్పే జట్టుగా ముద్ర పడ్డ పాకిస్థాన్, ఈ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది క్యాచ్‌లు అందుకోవడం గమనార్హం. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సైతం బౌండరీ వద్ద చక్కని క్యాచ్ పట్టి ఆకట్టుకున్నాడు. మొత్తానికి విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో పాకిస్థాన్ తన ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుకుని పరువు నిలుపుకుంది.
READ ALSO: Sunil Thapa: ప్రియాంక చోప్రా కోచ్ మృతి..
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!