Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barabar Premista Controversy: తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ చిత్ర హీరో చంద్రహాస్.. స్టేజ్‌పై పాడిన పాటలో అసభ్య పదజాలం వాడటంతో పెద్ద రగడ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రహాస్ తండ్రి ప్రముఖ నటుడు ప్రభాకర్ ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.
READ ALSO: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
Also Read
ఈ వివాదం సినీ పరిశ్రమలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చలకు దారితీసింది. సంపత్ రుద్ర దర్శకత్వంలో యువ నటుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన ‘గుంజి గుంజి’ అనే పాటలో అసభ్య, అనుచిత పదాలు వాడటంతో వివాదం మొదలైంది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రహాస్ పాడిన పాటలోని అసభ్యతపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయని సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై స్పందిస్తూ జేడీ చక్రవర్తి కూడా ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో హీరో చంద్రహాస్‌పై మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా దాఖలైంది.
ఈ నేపథ్యంలో చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ ఓ భావోద్వేగ వీడియోను సామాజిక వేదికల ద్వారా విడుదల చేశారు. ‘నా కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తప్పు. ఒక చిన్న పొరపాటుతో నా పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతున్నాను. ఆరోజు మూవీ ఫంక్షన్ కి వచ్చిన పెద్దలకు కూడా నేను క్షమాపనులు చెప్తున్నాను’ అని ప్రభాకర్ ఈ వీడియోలో పేర్కొన్నారు.
READ ALSO: High Protein Breakfast: తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు