CM Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్ సిటీలా.. దేశానికి క్వాంటం సెంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి సాంకేతిక విప్లవం, యువత పాత్ర, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు.
IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విద్యార్థులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. నా ఆశలన్నీ విద్యార్థులపైనే ఉన్నాయి. ఒక చరిత్ర రాయాలన్నా, లేదా ఉన్న చరిత్రను తిరగరాయాలన్నా అది కేవలం యువతకే సాధ్యం అని ఆయన అన్నారు. మన యువత ప్రస్తుతం క్వాంటం వేగంతో దూసుకుపోతోందని, వారి ఉత్సాహమే రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో హైదరాబాద్ రూపురేఖలను హైటెక్ సిటీ ఏ విధంగా మార్చేసిందో, రాబోయే రోజుల్లో ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భారతదేశానికే గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇక్కడి నుంచే ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందుతాయని తెలిపారు. 2030 నాటికి దేశానికి 2.5 లక్షల మంది క్వాంటం నిపుణులు అవసరమని, అందులో ఏపీ సింహభాగం వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న ప్రతి 100 మందిలో 35 మంది తెలుగువారే ఉండటం గర్వకారణమని అన్నారు.
సాంకేతికతపై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న అవగాహనను సీఎం కొనియాడారు. నేను ఎంతోమంది ప్రధాన మంత్రులతో పనిచేశాను, కానీ టెక్నాలజీపై ప్రధానికి ఉన్నంత అవగాహన మరెవరికీ లేదని ప్రశంసించారు. వాజపేయి హయాంలో టెలికమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పుల తరహాలోనే, ఇప్పుడు మోదీ నాయకత్వంలో 4G, తదుపరి తరం సాంకేతికతలతో దేశం పురోగమిస్తోందని అన్నారు. ఈ నెల 16న ప్రముఖ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ అమరావతికి రానున్నారు.
Off The Record : ఇద్దరు ఎంపీలపై పవన్ బాగా సీరియస్? ఎంత చెప్పినా ఎంపీల్లో మార్పు కనిపించడం లేదా?
ఏప్రిల్ 14న మరో రెండు క్వాంటం సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంకా క్వాంటం మిషన్ కోసం టీసీఎస్ (TCS), ఐబీఎం (IBM), ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థలతో చర్చిస్తున్నామని.. ఈ ఏడాది చివరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, కందుల దుర్గేష్, పద్మశ్రీ గ్రహీత ప్రొఫెసర్ కామకోటి తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖను మంత్రి లోకేష్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!