China: ‘హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన చైనా.. దీని వల్ల ప్రమాదం ఏంటంటే.?
- 'హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన చైనా..
- శాటిలైట్ కిల్లర్‌గా పనిచేయనున్న ఆయుధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మరో కొత్త రకం ఆయుధాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ‘‘హైపవర్ మైక్రోవేవ్ సిస్టమ్’’ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్లను దెబ్బ తీయవచ్చు. ముఖ్యంగా స్పేస్ఎక్స్ స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్‌కు అంతరాయం కలిగించవచ్చు. చైనా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఒక గిగావాట్ (1 GW) కంటే ఎక్కువ శక్తి కలిగిన గ్రౌండ్-బేస్డ్ మైక్రోవేవ్ ఆయుధం భూమి దిగువ కక్ష్యలో పనిచేసే స్టార్‌లింక్ ఉపగ్రహాలను దెబ్బతీసేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.
Read Also: Charlapalli Case Solved: వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!
Also Read
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్‌లోని నార్త్‌వెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలో వాంగ్ గ్యాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు TPG1000Cs అని పిలిచే హైపవర్ మైక్రోవేవ్ వ్యవస్థను తయారు చేశారు. సాధారణ మైక్రోవేవ్ వ్యవస్థలు చాలా కొద్ది సెకన్లు మాత్రమే పనిచేస్తాయి, కానీ చైనా తయారీ వ్యవస్థ ఒక నిమిషం పాటు నిరంతరంగా 20 గిగావాట్ల శక్తిని విడుదల చేయగలదు. దీంతో పాటు ఇది చిన్న పరిమాణం అంటే 4 మీటర్ల పొడవు, 5 టన్నుల బరువు ఉంటుంది. దీనిని ట్రక్కులు, నౌకలు, విమానాలు, అంతరిక్షంలో కూడా ఏర్పాటు చేసేలా చిన్నగా తయారు చేశారు.
3000 హై ఎనర్జీ మైక్రోవేవ్ పల్స్‌లు ఒక్కో సెషన్‌లో విడుదల చేస్తుందని, ఇది ఇప్పటికే 2 లక్షల టెస్ట్ పల్స్‌ను విడుదల చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. లో-ఎర్త్ ఆర్బిట్‌లో (LEO) తిరిగే శాటిలైట్లను, ఈ ఆయుధం నుంచి వచ్చే శక్తివంతమైన మైక్రోవేవ్‌లు వాటి ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని దెబ్బతీసే అవకాశం ఉందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. దీని ప్రధాన లక్ష్యం శాటిలైట్లు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని దెబ్బతీయవచ్చు.
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!