Varanasi Update: రాజమౌళి మరో మాస్టర్ ప్లాన్.. వారణాసి మొత్తం ఐమ్యాక్స్ కాదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Update: భాషా సరిహద్దులను బద్ధలు కొట్టిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలుసిందే. పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగిన తెలుగు దర్శకుడు జక్కన్న. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జక్కన్న మాట్లాడుతూ.. ‘వారణాసి’ చిత్రం మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తాయని వెల్లడించారు.
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
‘మా దగ్గరున్న థియేటర్లన్నీ ‘సినిమా స్కోప్’ ఫార్మాట్‌లో ఉంటాయి. ఈ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తీయాలనుకున్నప్పుడు నిజంగా ఇది మాకొక సవాల్ అనిపించింది. దీంతో సినిమాను ఏ ఫార్మాట్‌లో షూట్ చేయాలన్న దానిపై చిత్రబృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరకు మొత్తం యూనిట్ అంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ‘వారణాసి’ సినిమా మెజారిటీ భాగం 1.90:1 (సినిమా స్కోప్) లోనే ఉంటుంది. కానీ, కథలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలను మాత్రం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్ (1.43:1) లో వెండితెరపై ఆవిష్కరించనున్నాము’ అని వెల్లడించారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రెండు ఫార్మాట్లను కలిపేసి ఆ ప్రత్యేకతను పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఐమ్యాక్స్ షాట్స్‌ను ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తించాలి. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ నిండుగా ట్రూ ఐమ్యాక్స్ అనుభూతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఎంత కష్టమైనా సరే, మేము చేయగలం’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది.
READ ALSO: T20 World Cup 2026: ప్రపంచ కప్‌లో నవ్వుల పాలు కాకుండా బయటపడ్డ పాక్..
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!