ఉల్లిగడ్డ తినడం వల్ల మన శరీరంలోని కొవ్వు అనేది కరుగుతుంది.

 ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

అలాగే ఇది తినడం వల్ల రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటుంది.

నిద్రలేమితో బాధపడే వారు ఉల్లిని తీసుకోవడం ద్వారా చక్కగా నిద్రపోవచ్చు.

కేన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉల్లిలో ఉన్నాయి.

మొటిమల్ని తగ్గించడంలో ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది.

ఉల్లిపాయను రోజూ ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతను అధిగమించవచ్చు.

షుగర్‌తో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. 

జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి ఉపకరిస్తుంది.

మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యకు కూడా ఉల్లి ఔషధంలా పని చేస్తుంది. 

ఉల్లిపాయ రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. 

ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి తొందరగా తగ్గిపోతాయి.

జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేయడానికి ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది.