Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా!
- వాంఖడే స్టేడియంలో అమెరికాతో భారత్ మ్యాచ్
- హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదు
- ప్రాక్టీస్ సెషన్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు.
‘హోం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు అదనపు ప్రెషర్ ఉంటుంది. ఇది కచ్చితంగా అగీకరించాల్సిన విషయం. నిజాయతీగా చెప్పాలంటే నర్వస్, ఒత్తిడి ఉంటుంది. కానీ దీని పాజిటివ్ వైపు చూస్తే.. ఎంతో ఉత్సాహం ఉంటుంది. స్టేడియంలో 30 నుంచి 35 వేల మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తారు. వాళ్లందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. మా కుర్రాళ్లకు ఇదే చెప్పా’ అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ప్రపంచంలో నెంబర్‌వన్ టీ20 జట్టుగా ఉన్న భారత్ మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ ఏ జట్టునూ తేలికగా తీసుకోవడం లేదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ‘టోర్నీలో బలహీనమైన జట్టు అంటూ ఏదీ లేదు. 20 జట్లు మంచి క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉన్నవే. పొట్టి ఫార్మాట్‌లో 1-2 బ్యాటర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలరు. లేదా ఒక బౌలర్ 24 బంతుల్లో గేమ్‌ను మార్చేయవచ్చు. అందుకే ప్రతి జట్టుతో ఒకే విధంగా ఆడాలి’ అని చెప్పాడు. యూఎస్‌ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సంజయ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ… ‘భారత్‌తో, అదీ ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆడటం అమెరికా క్రికెట్‌కు గర్వకారణం. ఇది మా దేశంలో కొత్త తరం క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్ నుంచే వరల్డ్‌కప్‌లో తన ఆధిపత్యాన్ని చాటాలని టీమిండియా ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!