Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్‌లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!
- ఐసీసీ ట్రోఫీలపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం
- రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు
- వరల్డ్ క్రికెట్‌లో సువర్ణ యుగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cricket Golden Era: భారత క్రికెట్ మరోసారి ప్రపంచానికి తన శక్తిని చాటింది. సీనియర్ నుంచి అండర్-19 వరకూ.. పురుషులు, మహిళలు అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తూ ఐసీసీ ట్రోఫీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ ఒకేసారి ఐదు ప్రధాన ఐసీసీ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.
పురుషుల విభాగంలో భారత్ 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని పొట్టి ఫార్మాట్‌లో తన సత్తాను నిరూపించింది. ఆ తర్వాత 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుని. వన్డే క్రికెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు విజయాలు భారత సీనియర్ జట్టు స్థిరత్వం, లోతైన బెంచ్ స్ట్రెంత్‌కు నిదర్శనంగా నిలిచాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
మహిళల క్రికెట్‌లోనూ భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుని తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత మహిళల జట్టు అందుకుంది. అంతేకాదు, అదే ఏడాది జరిగిన మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ భారత్ విజేతగా నిలిచి యువ ప్రతిభలోనూ తన ఆధిపత్యాన్ని చాటింది.
Also Read: U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితా.. భారత్ ఆధిపత్యం మామూలుగా లేదుగా!
యువ క్రికెట్‌లో భారత జట్టు ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2026లో జరిగిన పురుషుల అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని భారత్ మరోసారి భవిష్యత్ క్రికెట్ తనదేనని నిరూపించింది. వరుసగా వస్తున్న యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉండటం భారత క్రికెట్ వ్యవస్థ బలాన్ని చూపిస్తోంది.
ప్రస్తుతం భారత్ ఒకేసారి పురుషుల టీ20 వరల్డ్‌కప్ (2024), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025), మహిళల వన్డే వరల్డ్‌కప్ (2025), మహిళల అండర్-19 వరల్డ్‌కప్ (2025), పురుషుల అండర్-19 వరల్డ్‌కప్ (2026) టైటిల్స్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలుస్తోంది. అన్ని స్థాయిల్లోనూ విజయాలు సాధిస్తూ.. భారత క్రికెట్ నిజంగా స్వర్ణయుగంలోకి అడుగుపెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!