U19 World Cup Winner: జయహో భారత్.. ఆరోవసారి జగజ్జేతగా భారత్!
- అండర్-19 వరల్డ్‌కప్ 2026లో భారత్ ఛాంపియన్
- ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల విజయం
- ఆరోసారి అండర్-19 భారత్ వరల్డ్‌కప్ టైటిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
U19 World Cup Winner: ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరోవసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఆయుష్ మత్రే 53 పరుగులు, అభిగ్యాన్ కుందు 40 పరుగులతో మంచి సహకారం అందించారు. చివర్లో కనిష్క్ చౌహాన్ వేగంగా 37 పరుగులు చేసి స్కోర్‌ను 400 దాటించాడు.
412 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో పోరాడినా.. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కేలబ్ ఫాల్కనర్ 115 పరుగులతో శతకం సాధించి పోరాడినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివరకు ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్‌లో ఆర్.ఎస్. అంబ్రిష్ 3 వికెట్లు, దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
Congratulations to India U19 on winning the ICC Men's U19 World Cup 2026 👏👏
Their historic 6⃣th title 🫡
Take. A. Bow 🙇
Scorecard ▶️ https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/5a0Pf4wpTw
— BCCI (@BCCI) February 6, 2026
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!