Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్.. మధ్యలో హీరో ఆదికి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ‘బరా బర్ ప్రేమిస్తా’ ఈవెంట్‌లో పాడిన అసభ్యకరమైన పాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఈ పాటపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుంటే, చంద్రహాస్ మాత్రం అస్సలు తగ్గకుండా “నేను ఎవరికీ క్షమాపణలు చెప్పను” అంటూ ఎదురు దాడికి దిగి గొడవను మరింత పెద్దది చేశాడు. చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఆయనపై కేసు కూడా నమోదైంది. సోషల్ మీడియాలో తనను విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ ఆయన చేసిన వీడియోలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలదన్నట్లు..ఈ వివాదంలో హీరో ఆది సాయికుమార్ రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఈ రచ్చ పై ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. “ప్రభాకర్ గారు పిలిచారనే గౌరవంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను. కానీ అక్కడ జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. పబ్లిక్ ఈవెంట్లలో సందేశాలు ఇచ్చేటప్పుడు గౌరవం, బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్స్‌కు ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు” అని గట్టిగానే హితవు పలికారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. ఆ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆది దానిని తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రభాకర్ తో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల లేదా సినిమా ఇండస్ట్రీ పెద్దల ఒత్తిడి వల్ల ఆది వెనక్కి తగ్గారా అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి చంద్రహాస్ ప్రవర్తన వల్ల ఇటు తండ్రి ప్రభాకర్‌కు, అటు సపోర్ట్ చేసిన గెస్టులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు