Under 19 World Cup: సాహో భారత్.. విశ్వవిజేత అయినా ప్రైజ్ మనీ ఇవ్వని ఐసీసీ! కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Under 19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు నయా చరిత్రను సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా విజయ దుందుభి మోగించి, ఆరోసారి టైటిల్‌ను సగౌరవంగా ముద్దాడింది. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా(6 సార్లు) టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫస్ట్ నుంచి భారత జట్టు అద్భుతంగా రాణించింది, అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
READ ALSO: Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
భారత్ చారిత్రాత్మక విజయం..
ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు 411 పరుగుల భారీ లక్షాన్ని ఛేదించడం సవాల్‌గా మారింది. ఒత్తిడి తట్టుకోలేక 311 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే నాయకత్వంలో టీమిండియా ఈ మెగా టోర్నీలో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
ఐసీసీ నుంచి రూపాయి ప్రైజ్ మనీ రాదు..
ఈ చారిత్రాత్మక విజయాన్ని టీమిండియా సొంతం చేసుకున్నటికీ, భారత జట్టుకు ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక ప్రైజ్ మనీ లభించదు. అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఐసీసీ ఎటువంటి నగదు బహుమతులను ఇవ్వదని గమనించాలి. ఐసీసీ నిబంధనల ప్రకారం.. అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను కేవలం ఒక ‘డెవలప్‌మెంట్ టోర్నమెంట్’గా మాత్రమే పరిగణిస్తారు. దీని ఉద్దేశం యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడం మాత్రమే కానీ, దీనిని పూర్తిస్థాయి వాణిజ్య టోర్నీగా చూడరు. ఈ టోర్నీలో విజేతలకు లేదా రన్నరప్‌లకు ఐసీసీ ఎలాంటి నగదు బహుమతి ప్రకటించదు. కేవలం ట్రోఫీ, మెడల్స్ మాత్రమే అందజేస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ టోర్నీలో పాల్గొనే జట్ల ప్రయాణ ఖర్చులు, వసతి, భోజన సదుపాయాలను మాత్రం ఐసీసీనే భరిస్తుంది. మునుపటి ఎడిషన్‌లో కూడా ఐసీసీ విజేతగా నిలిచిన జట్టుకు ఎటువంటి ప్రైజ్ మనీని ఇవ్వలేదు.
అయినప్పటికీ భారత జట్టు క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి ముఖ్యమైన విజయాలకు BCCI తరచుగా తన ఆటగాళ్లకు గణనీయమైన నగదు అవార్డులను అందజేస్తుంది. ఉదాహరణకు 2024 U19 ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన సందర్భంలో BCCI ప్రతి క్రీడాకారుడికి రూ.30 లక్షలు బహుమతిగా ఇచ్చింది. దీంతో ఈసారి కూడా BCCI ఛాంపియన్లకు, సహాయక సిబ్బంది, కోచింగ్ బృందం కోసం ముఖ్యమైన ప్రకటనలు చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..